భార్యను చంపి.. రెండు రాత్రులు శవంతో జాగారం చేసిన భర్త

sivanagaprasad kodati |  
Published : Oct 22, 2018, 01:35 PM IST
భార్యను చంపి.. రెండు రాత్రులు శవంతో జాగారం చేసిన భర్త

సారాంశం

అనుమానంతో భార్యను చంపి అనంతరం ఆమె శవంతో రాత్రంతా జాగారం చేశాడో భర్త. ఢిల్లీకి చెందిన కామిల్, రేష్మలకు మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది.

అనుమానంతో భార్యను చంపి అనంతరం ఆమె శవంతో రాత్రంతా జాగారం చేశాడో భర్త. ఢిల్లీకి చెందిన కామిల్, రేష్మలకు మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది. అంబేడ్కర్ యూనివర్సిటీలో ప్యూన్‌గా పనిచేస్తూ కుటుంబంతో పాటు కమలా మార్కెట్ ప్రాంతంలో నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో తన భార్య.. మరో ఇద్దరు యువకులతో సన్నిహితంగా ఉంటుందని కామిల్ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం రాత్రి పీకల దాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం భార్యతో వాగ్వావాదానికి దిగి కోపంలో ఆమె గొంతు నులిమి చంపేశాడు.

అయితే ఏం చేయాలో తెలియక శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తన రెండేళ్ల కూతురితో పాటు భార్య శవం పక్కనే కూర్చొని ఉండిపోయాడు. చివరికి ఆదివారం ఉదయం కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగినది చెప్పి లొంగిపోయాడు.

పోలీసులు కామిల్ ఇంటికి వెళ్లి చూడగా.. అప్పటికే చనిపోయి రెండు రోజులు కావొస్తుండటంతో రేష్మ మృతదేహం నీలం రంగులోకి మారిపోయింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System