‘అమ్మ’ అంత్యక్రియలకు రూ.కోటి ఖర్చు..?

By ramya neerukondaFirst Published Oct 22, 2018, 12:15 PM IST
Highlights

జయలలిత అంత్యక్రియల కోసం రాష్ట్రప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? అన్న మరో ప్రశ్నకు రాష్ట్రప్రభుత్వ ప్రజాపనుల శాఖ తరపున తెలియజేసిన సమాధానంలో, రూ.99 లక్షల 33 వేల 586 అని ఉంది.

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.1కోటి ఖర్చు చేసిందని వెల్లడైంది. మదురై కేకే నగర్‌కు చెందిన సయ్యద్‌ తమీమ్‌ అనే సంఘ సేవకుడు జయలలిత మరణంపై పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరుతూ సీఎం ప్రత్యేక విభాగం, ప్రజా సమాచార విభాగానికి సమాచార హక్కుల చట్టం కింద దరఖాస్తు సమర్పించారు.
 
అందులో, జయలలిత ఎప్పుడు మరణించారు? అన్న ప్రశ్నకు 2016 డిసెంబర్‌ 5వ తేదీ అని ఉంది. అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందినందుకు రాష్ట్రప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? అన్న ప్రశ్నకు ప్రభుత్వం పైసా కూడా ఖర్చుపెట్టలేదని ఉంది. జయలలిత అంత్యక్రియల కోసం రాష్ట్రప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? అన్న మరో ప్రశ్నకు రాష్ట్రప్రభుత్వ ప్రజాపనుల శాఖ తరపున తెలియజేసిన సమాధానంలో, రూ.99 లక్షల 33 వేల 586 అని ఉంది.
 
ఇక, మాజీ శాసనసభ్యులకులాగే జయలలితకు కూడా కుటుంబ పింఛన్‌ పంపిణీ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు, పింఛన్‌కు సంబంధించిన వ్యవహారంలో నిర్ణయం తీసుకొనే అధికారం అసెంబ్లీ కార్యదర్శికి మాత్రమే ఉందని, దీనిపై ఆయనే సమాధానం చెప్పాలని అందులో వివరించారు.
 

click me!