పెళ్లయిన రెండు గంటలకే...మండపంలోనే విడిపోయిన నవదంపతులు

Arun Kumar P   | Asianet News
Published : Dec 02, 2020, 11:19 AM ISTUpdated : Dec 02, 2020, 11:47 AM IST
పెళ్లయిన రెండు గంటలకే...మండపంలోనే విడిపోయిన నవదంపతులు

సారాంశం

మానవ  సంబంధాలు ఎంత బలహీనంగా మారాయో తెలియజేసే సంఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

గోరఖ్‌పూర్: పెద్దల సమక్షంలో జరిగిన పెళ్ళి అదే పెద్దల సమక్షంలో పెటాకులయ్యింది. మూడుముళ్ల బంధంతో ఒక్కటయిన రెండు గంటల్లోనే నవదంపతులు దూరమయ్యారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... గోరఖ్ పూర్ జిల్లాలోని హెమ్చాపర్ గ్రామంలో ఓ వివాహం జరిగింది. పెళ్లి తంతు, ఆ తర్వాత బంధువులను కలవడం వంటి వాటితో అలసిపోయిన వరుడు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఒక్క సంఘటన  నవ వధూవరులను దూరం చేసింది. 

వరుడు స్పృహ తప్పడంతో అతడికి ఏదో జబ్బు వుండి వుంటుందని వధువు తరపువారు అనుమానించారు. ఇదే విషయాన్ని వరుడి తరపు వారిని నిలదీయగా ఇరు కుటుంబాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలోనే ఇద్దరి తరపు పెద్దల మధ్య రెండు గంటలపాటు పంచాయతీ జరిగింది. అయినా ఇరు వర్గాల మధ్య రాజీ కుదరకపోవడంతో ఈ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. 

ఇలా రెండు గంటలకే వివాహం కాస్తా పెటాకులైంది. దీంతో పెళ్ళికి వచ్చినవారంతా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?