పుల్వామా దాడి.. కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు

By ramya NFirst Published Feb 18, 2019, 4:27 PM IST
Highlights

పుల్వామా దాడిలో 43మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సినీనటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

పుల్వామా దాడిలో 43మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సినీనటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా.. కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేపట్టడం లేదంటూ కమల్  ప్రశ్నించారు.

సోమవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పొల్గొని మాట్లాడారు. ‘‘ ‘కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు అవకాశం ఇవ్వాలి. వాళ్లు దీన్ని ఎందుకు చేపట్టడం లేదు. ప్రజాభిప్రాయం సేకరించేందుకు ఎందుకు భయపడుతున్నారు?’’ అని కేంద్రాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.

‘పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని రైళ్లలో జీహాదీలను హీరోలుగా చిత్రికరిస్తూ వాళ్లు ఫోటోలు ప్రదర్శిస్తున్నారు. ఇది బుద్ధిహీనమైన చర్య. భారత్ కూడా దీనికి ఏమాత్రం తేడా లేకుండా ప్రవర్తిస్తోంది. ఇది మంచిది కాదు. భారత్ మంచి దేశమని నిరూపించదల్చుకుంటే.. మనం ఇలా చేయకూడదు.’ అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘‘ఓ సైనికుడు ఎందుకు చనిపోవాలి? ఇరువైపులా రాజకీయ నాయకులు సరిగా ప్రవర్తిస్తే ఓ సైనికుడు చనిపోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు సరిహద్దు రేఖ సైతం నియంత్రణలో ఉంటుంది. మయ్యం మ్యాగజైన్ రాస్తున్నప్పుడు.. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు ఏం జరగబోతోందో కూడా రాశాను. ఇవాళ నేను దు:ఖంలో మునిగిపోయాను. ఎందుకంటే ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను...’ అని కమల్ పేర్కొన్నారు.

click me!