అమిత్‌షాకు ఆర్ధిక శాఖ ఎందుకంటే..?

By Siva KodatiFirst Published May 30, 2019, 6:27 PM IST
Highlights

ఉత్కంఠకు తెర పడింది. అందరూ ఊహించినట్లుగానే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. అది కూడా ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖను ఆయన చేతుల్లో పెట్టారు ప్రధాని నరేంద్రమోడీ.

అమిత్‌కు ఆర్ధిక, హోం, రక్షణ శాఖల్లో ఏదో ఒకటి ఖాయమవుతుందని ముందు నుంచి ఊహాగానాలు వినిపించాయి. అందుకు తగ్గట్టే మోడీ తర్వాత నెంబర్ 2గా చెప్పుకునే ఆర్ధికశాఖ బాధ్యతలు షాకు దక్కాయి.

గుజరాత్‌కు చెందిన అమిత్ షా ఆ రాష్ట్రంలో వ్యాపార కులమైన బనియా వర్గానికి చెందిన వారు. తండ్రి వ్యాపారాన్ని అనంతరం షా నిర్వర్తించారు. అంతేకాకుండా స్టాక్ బ్రోకర్‌గా సైతం పనిచేసిన ఆయనకు వాణిజ్యంపై మంచి పట్టుంది.

జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వంటి పలు కారణాలతో దేశ ఆర్ధిక రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దీంతో వ్యవస్ధను గాడిలో పెట్టాలంటే సమర్ధుడైన వ్యక్తి అవసరం.. అందువల్ల అమిత్ షానే ఇందుకు సరైన వ్యక్తిగా భావించిన ప్రధాని ఆయనను ఆర్ధిక శాఖ మంత్రిగా నియమించారు. 
 
click me!