ఇంటర్ ఫెయిల్.. అయితేనేం.. కోట్లొచ్చే కంపెనీల స్థాపన.. సుశీల్ సింగ్ సక్సెస్ స్టోరీ..!

By Mahesh Rajamoni  |  First Published Sep 11, 2023, 4:10 PM IST

సుశీల్ సింగ్ ఒక సాధారణ కుటుంబానికి చెందని వ్యక్తి. ఇతను ఉపాది కోసం జౌన్పూర్ జిల్లాలోని ఒక గ్రామం నుంచి ముంబైకి వచ్చాడు. ఇతని తండ్రి బ్యాంకులో సెక్యురిటీ గార్డుగా పనిచేసేవాడు. అయినా.. 
 


జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్న కోరిక ఉంటే.. ఎన్నో వైఫల్యాలు, సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాటన్నింటిని ఎదుర్కొని నిలబడినప్పుడే ఒక వ్యక్తి గొప్ప వాడవుతాడు. అనుకున్న దాన్ని సాధించగలుగుతాడు. ఇవే అసలైన విజయానికి మెట్లు. దీనికి సుశీల్ సింగ్ కథ ఒక ఉదాహరణ. సుశీల్ సింగ్ కస్టమర్ సర్వీస్ బీపీఓ అయిన ఎస్ఎస్ఆర్ టెక్విజన్ సహా పలు వ్యాపారాలను నిర్వహిస్తున్నాడు. ప్రముఖ బి2సి ఫ్యాషన్ ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్ డీబాకో, శైవా సిస్టమ్ ఇంక్.. ఒక విదేశీ ఐటి సేవల సంస్థ. అలాగే లాభాపేక్ష లేని గ్రూపు వ్యాపారాలు. ఇంత సాధారణ వ్యక్తి ఇన్ని కంపెనీలను ఎలా స్థాపించాడు. అతని సక్సెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

సుశీల్ సింగ్ కాలేజీ డ్రాపవుట్. ఈయన ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాకు చెందిన వాడు. ఒక సాధారణ కుటుంబానికి చెందిన సుశీల్ సింగ్ కాలేజీ డ్రాపవుట్ అయినప్పటికీ.. ఇప్పుడు మిలియనీర్ టెక్నోప్రెన్యూర్. ఇతనికి ఇప్పుడు మూడు లాభదాయకమైన వ్యాపారాలున్నాయి. అంతేకాదు ఇతను లాభాపేక్షలేని మూడు సంస్థల వ్యవస్థాపకుడు కూడా. మీకు తెలుసా? ఇతను నెలకు కేవలం రూ.11,000 జీతంతో తన కెరీర్ ను మొదలుపెట్టాడు. ఇప్పుడు కోట్ల రూపాలయను సంపాదిస్తున్నాడు. 

Latest Videos

సుశీల్ సింగ్ ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. ఉపాధి కోసం జౌన్పూర్ జిల్లాలోని ఒక గ్రామం నుంచి ముంబైకి మకాం మార్చాడు. తల్లి ఇంటిని నిర్వహిస్తుండగా.. తండ్రి ఒక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. 

కల్యాణ్ డోంబివ్లి మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న అల్పాదాయ కుటుంబాల కోసం హిందీ మీడియం పాఠశాలలో సుశీల్ సింగ్ చదువుకున్నాడు. 10వ తరగతి వరకు ఇతను చదువులో బాగానే రాణించాడు. అయితే సుశీల్ సింగ్ కు నేర్చుకోవడంపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదట. దీంతో అతని హైస్కూల్  పరిస్థితులు మారిపోయాయి. ది బెటర్ ఇండియా ప్రకారం.. సుశీల్ సింగ్ 12 వ తరగతి బోర్డు పరీక్షల్లో విఫలమయ్యాడు. కానీ తర్వాత సంవత్సరం విజయం సాధించాడు.

undefined

ఆ తర్వాత సుశీల్ సింగ్ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే  మ్యాథ్స్ లో ఫెయిల్ అయిన తర్వాత 2003 లో సెకండ్ ఇయర్ లో చదువును దూరమయ్యాడు. 2015లో పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన సుశీల్ ఎంట్రీ లెవల్ టెలీకాలర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా నెలకు కేవలం రూ.11,000 జీతంతో కంపెనీలో చేరాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత సుశీల్ సింగ్ సరితా రావత్ సింగ్ ను పెళ్లి చేసుకున్నాడు. అలాగే వీరు నోయిడాలో ఎస్ఎస్ఆర్ టెక్విజన్ ను యూఎస్ ఆధారిత వ్యాపారంతో కలిసి కస్టమర్ సర్వీస్ బీపీఓను ప్రారంభించారు. అమెరికాకు చెందిన వ్యాపారాల్లో మూడు, నాలుగు నెలలు పనిచేసిన తర్వాత నోయిడాలో కో-వర్కింగ్ స్పేస్ లభించింది.

రెండున్నర సంవత్సరాల తర్వాత వ్యాపారం చివరికి మొత్తం నోయిడా భవనాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించిందని సుశీల్ సింగ్ పేర్కొన్నారు. వారి రెండో వ్యాపారం డీబాకో, గ్లోబల్ బి 2 సి దుస్తుల ఆన్లైన్ స్టోర్. అయితే ఈ మధ్యకాలంలో వీరు మూడో వ్యాపారమైన శైవ సిస్టమ్ ఇంక్ ను ప్రారంభించారు. దీనిని 2019 లో సుశీల్ సింగ్ స్థాపించారు. ఇది బహుళజాతి ఐటి కన్సల్టింగ్ సంస్థ. ఇది వ్యాపారాలకు వారి ప్రత్యేకమైన జాబ్ ప్రొఫైల్ అవసరాల కోసం అగ్ర అభ్యర్థులను కనుగొనడంలో సహాయపడుతుంది. అమెరికా, భారత్ లలో వ్యాపారాలకు టాప్ ఎంప్లాయిమెంట్ ఏజెన్సీగా మారాయి. అయితే సుశీల్ సింగ్ నికర విలువ గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు. అయితే ఇది కోట్లలో ఉంటుందని అనేక నివేదికలు నమ్ముతున్నాయి.
 

click me!