Boris Johnson: నేనైతే సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్‌లా ఫీల్ అయ్యా.. యూకే పీఎం జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Apr 22, 2022, 03:49 PM IST
Boris Johnson: నేనైతే సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్‌లా ఫీల్ అయ్యా.. యూకే పీఎం జాన్సన్   ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

భారత పర్యటనలో ఉన్న యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న భారత్‌కు వచ్చిన ఆయనకు గుజరాత్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ ఘన స్వాగతంపై ఆయన స్పందిస్తూ.. తాను సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్‌లా ఫీల్ అయ్యానని పేర్కొన్నారు.  

న్యూఢిల్లీ: యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తన పర్యటన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయనకు గుజరాత్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ స్వాగతాన్ని యూకే పీఎం జాన్సన్ గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎటు చూసిన తన ముఖమే కనిపించిందని, భారీ హోర్డింగ్‌లు, పోస్టర్లతో తన స్వాగతం అదిరిపోయిందని ఆయన పేర్కొన్నారు. తనకు స్వాగతం పలికిన తీరును చూస్తే.. తనను తాను సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్‌లా ఫీల్ అయ్యారని వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోడీ తనకు ఖాస్ దోస్తు (ప్రియమిత్రుడు) అని పేర్కొన్నారు. ఈ మాటను తాను హిందీలోనే వాడాలని అనుకున్నట్టు తెలిపారు. ఇండియాలో తాము తాము రెండు అద్భుతమైన రోజులు గడిపామని వివరించారు. ప్రధాని మోడీ జన్మించిన రాష్ట్రం గుజరాత్‌ను పర్యటించిన తొలి కన్జర్వేటివ్ బ్రిటన్ ప్రధాని తానే అని బోరిస్ జాన్సన్ తెలిపారు. అంతేకాదు, సగం బ్రిటీష్ ఇండియన్లకు ఈ రాష్ట్రమే పుట్టిళ్లు అని వివరించారు. తనకు ఈ రాష్ట్రం నుంచి గొప్ప స్వాగతం
లభించిందని పేర్కొన్నారు. ‘నేనైతే సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్‌లా ఫీల్ అయ్యాను’ అని అన్నారు. అమితాబ్ బచ్చన్‌లాగే ఎక్కడ చూసినా తన ముఖమే కనిపించిందని తెలిపారు.

బోరిస్ జాన్సన్ రెండు పర్యటన నిమిత్తం గురువారం భారత్‌కు వచ్చారు. అహ్మదాబాద్‌లో తన పర్యటన మొదలైంది. తన పర్యటనలోని తొలి రోజును ఆయన గుజరాత్‌లో గడిపారు. సబర్మతి ఆశ్రమం పర్యటించి చర్ఖా తిప్పారు. గాంధీనగర్‌లోని స్వామినారాయణ్ సెక్ట్‌కు చెందిన అక్షరదామ్ టెంపుల్‌నూ సందర్శించారు. అదే విధంగా ఓ జేసీబీ తయారీ యూనిట్‌నూ సందర్శించారు. గురువారం రాత్రి ఆయన ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. ఢిల్లీలో ఆయనకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు.

ఈ రోజు బోరిస్ జాన్సన్, భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో కలిశారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్, యూకేల మధ్య సంబంధాలను పేర్కొంటూ.. యూకే, ఇండియాల మధ్య ఇంతటి దృఢమైన బంధం ఇది వరకు ఎప్పుడూ లేదని వివరించారు.

గుజరాత్ ప్రజలు ఫెంటాస్టిక్‌గా వెల్‌కమ్ చెప్పారని బోరిస్ జాన్సన్ అన్నారు. ఇది నిజంగా అసాధారణం అని వివరించారు. ఇంతటి ఘన స్వాగతం తనకు ప్రపంచవ్యాప్తంగా మరే దేశంలోనూ లభించలేదని అన్నారు. తొలిసారి ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌ను చూడటం కూడా చాలా బాగుంది అని పేర్కొన్నారు.

రెండు రోజుల Indiaపర్యటనకు వచ్చిన బ్రిటిష్ ప్రధాని Boris Johnson శుక్రవారం నాడు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరుకొన్నారు. రాష్ట్రపతి భవన్ లో ప్రధాని Narendra Modi  బోరిస్ జాన్సన్ కు ఘన స్వాగతం పలికారు.

యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ New Delhi లోని రాజ్ ఘాట్ వద్ద పుష్పగుచ్చం ఉంచి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాతో వ్యూహాత్మక రక్షణ, దౌత్య, ఆర్ధిక భాగస్వామ్యంపై చర్చలు జరుపుతారు.  ఇండో పసిఫిక్ లో సన్నిహిత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు భద్రతా సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఉండనుంది.

PREV
click me!

Recommended Stories

Vijay Election Campaign: రోడ్డుపై సైకిల్ తొక్కిన విజయ్ ఫ్యాన్స్ దూసుకురాగానే షాక్! | Asianet Telugu
Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu