భారత్‌కు యూకే పీఎం బోరిస్ జాన్సన్..! విజయ్ మాల్యా, నీరవ్ మోడీల తరలింపు ఎప్పుడు? వారు ఎక్కడున్నారు?

Published : Apr 19, 2022, 05:04 PM IST
భారత్‌కు యూకే పీఎం బోరిస్ జాన్సన్..! విజయ్ మాల్యా, నీరవ్ మోడీల తరలింపు   ఎప్పుడు? వారు ఎక్కడున్నారు?

సారాంశం

యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఈ వారంలోనే భారత్‌కు రానున్నారు. ఈ పర్యటనలో ఆయన వాణిజ్యపరమైన అంశాలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపై చర్చించనున్నారు. అయితే, వీటితోపాటు భారత ప్రభుత్వ బ్యాంకుల్లో కోట్ల మేర బకాయి పడి యూకేలో ఉంటున్నవారిని స్వదేశానికి తరలింపుపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే విజయ్ మాల్యా, నీరవ్ మోడీలు ఎప్పుడు భారత్‌కు రావొచ్చు? వారు ఎక్కడున్నారు? వంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం.  

న్యూఢిల్లీ: యూకే పీఎం బోరిస్ జాన్సన్ ఈ వారంలో భారత్‌లో పర్యటించనున్నారు. వాణిజ్యపరమైన ఒప్పందాలతోపాటు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి ఈ దేశ ప్రధాని ప్రధానంగా చర్చించవచ్చు. అయితే, వీటితోపాటు భారత్ మరో కీలక అంశాన్ని బోరిస్ జాన్సన్‌తో ప్రస్తావించే అవకాశం ఉన్నది. భారత బ్యాంకుల్లో కుచ్చుటోపి పెట్టి ఇంగ్లాండ్‌లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లను ఎప్పుడు మళ్లీ ఇండియాకు తరలిస్తారనే ప్రశ్న కొన్నేళ్లుగా నానుతూనే ఉన్నది. భారత్ పర్యటించనున్న యూకే పీఎం బోరిస్ జాన్సన్‌తో
విజయ్ మాల్యా, నీరవ్ మోడీల తరలింపుపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇద్దరు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? భారత్‌కు తీసుకురావాలనే వాదనపై వారి అభిప్రాయాలు ఏమిటి? 

విజయ్ మాల్యా, నీరవ్ మోడీలు ఎవరు?
ఒకప్పుడు ఇండియాలో పేరుమోసిన బిజినెస్ మ్యాగ్నెట్ విజయ్ మాల్యా. లిక్కర్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి సక్సెస్ అయ్యాడు. ఎయిర్‌లైన్, ఫార్ములా వన్ టీమ్, ఐపీఎల్ క్లబ్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టి కోట్లు గడించాడు. కానీ, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ విఫలం కావడంతో ఆయన లాభాలు నష్టాల్లోకి వెళ్లాయి. ఒకదాని వెంట మరోటి నష్టాల బాటలోకి వెళ్లాయి. 2012లో కేంద్ర ప్రభుత్వం కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ లైసెన్స్ రద్దు చేసింది. ఆయనకు ఇచ్చిన లోన్లు తిరిగి పొందే ప్రయత్నాలను బ్యాంకులు ముమ్మరం చేయడంతో 2016లో దేశం విడిచాడు.

వజ్రాల వ్యాపారి కొడుకు నీరవ్ మోడీ.. అంతర్జాతీయ ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఇండియా నుంచి న్యూయార్క్, హాంకాంగ్ వరకూ ఆయన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 2017లో ఫోర్బ్స్ మ్యాగజిన్ సంపద 1.8 బిలియన్ డాలర్లుగా పేర్కొంటూ జాబితాలో నీరవ్ మోడీని చేర్చింది. కానీ, ఆయనపై 1.8 బిలియన్ డాలర్ల బ్యాంకు ఫ్రాడ్ ఆరోపణలు రాగానే జాబితా నుంచి ఆయన పేరును తొలగించింది. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రాడ్ బహిరంగం కావడంతో ఆయన దేశం వదిలిపారిపోయాడు.

ఇప్పుడు వారిద్దరు ఎక్కడ ఉన్నారు?
లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాకు యూకేలో అనేక నివాసాలు ఉన్నాయి. అయితే, లండన్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్ గ్రామంలోని లేడీవాక్ మాన్షన్‌లో ఉంటున్నట్టు సమాచారం.

నీరవ్ మోడీ మాత్రం సౌత్ వెస్ట్ లండన్‌‌లోని జైలులో ఉంటున్నాడు. 2019 మార్చిలో నీరవ్ మోడీ అరెస్టు అయ్యాడు. ఆయన బెయిల్ దరఖాస్తును కోర్టు ఏడుసార్లు తిరస్కరించింది.

భారత్‌కు తరలింపుపై వారి వాదనలు
భారత్‌కు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని విజయ్ మాల్యా సవాల్ చేశాడు. కానీ, ఆయన సవాల్‌ను 2020లో యూకే సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయినప్పటికీ ఆయన ఇప్పటికీ బెయిల్‌పై లండన్‌లోనే ఉన్నాడు.యూకే హోం సెక్రెటరీ ప్రీతి పటేల్ సంతకం పెడితే.. మాల్యాను భారత్‌కు తరలించడం లాంఛనమే. అయితే, తరలింపు విజ్ఞప్తిపై న్యాయపరమైన ప్రక్రియ జరుగుతున్నదని చెబుతున్నారు. కానీ, అదే తరుణంలో విజయ్ మాల్యా యూకేలోనే ఆశ్రయం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టూ తెలిసింది. దీనిపై
అధికారిక ప్రకటన ఏమీ వెలువడలేదు. 

నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించడానికి యూకే 2021 ఏప్రిల్‌లో అంగీకరించింది. కానీ, తన మానసిక ఆరోగ్యం సరిగా లేదని, ఒక వేళ తనను ఇండియాకు తరలిస్తే.. ఆత్మహత్య చేసుకునే ముప్పు ఉన్నదని నీరవ్ మోడీ కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై చివరిసారిగా డిసెంబర్ 14న విచారణ జరిగింది. ఈ అప్పీల్‌లోనూ నీరవ్ మోడీ ఓడిపోతే.. మరిన్ని భారత్ విజ్ఞప్తిని సవాల్ చేయడానికి ఆయన దగ్గర మరిన్ని న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్