కాంగ్రెస్ పార్టీ అయోధ్య ప్రారంభోత్సవాన్ని తిరస్కరించడానికి కారణం ఏంటి?

By SumaBala Bukka  |  First Published Jan 12, 2024, 11:56 AM IST

జనవరి 22న జరిగే అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమ సీనియర్ నేతలు హాజరుకావడం లేదని కాంగ్రెస్ చెబుతోంది. మన దేశంలో లక్షలాది మంది రాముడిని పూజిస్తారని, మతం వారి వ్యక్తిగత విషయమని ఆ పార్టీ పేర్కొంది.


ఢిల్లీ : దేశంలో ఎన్నికలకు నెలరోజుల ముందు జనవరి 22న అయోధ్యలో జరిగే ‘ప్రాణ్‌ప్రతిష్ట’ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రామజన్మభూమి ఆలయ ట్రస్ట్‌ పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి "గౌరవపూర్వకంగా" తిరస్కరించారు.

జనవరి 22న అయోధ్యలో జరిగే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమ సీనియర్ నేతలు హాజరుకావడం లేదని కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది. “మన దేశంలో లక్షలాది మంది రాముడిని పూజిస్తారు”, “మతం అనేది వ్యక్తిగత విషయం” అని వారు తెలిపారు. "అసంపూర్ణ" ఆలయ ప్రారంభోత్సవాన్ని ఎన్నికల లాభం కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) చేస్తున్న కుట్రగా కాంగ్రెస్ అభివర్ణించింది.

Latest Videos

అయితే, అయోధ్య అంశంపై కాంగ్రెస్ ఎప్పుడూ బాలిస్టిక్‌గా వ్యవహరించలేదు. దానికి బదులు, రామజన్మభూమి ఆందోళన, బాబ్రీ మసీదు విధ్వంసం వంటి వాటి విషయంలో పార్టీ ఉద్దేశ్యాలు ఊగిసలాటలో ఉండిపోతున్నాయి. మరోవైపు బాబ్రీ మసీదు తాళాలు ఎప్పుడు తెరిచారనే విషయాలు దివంగత రాజీవ్ గాంధీకి తెలియదని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వివాదాస్పద రామజన్మభూమి స్థలంలో రామమందిరం శంకుస్థాపన చేయడానికి విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి)కి అప్పుడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీనే అనుమతి ఇచ్చారు.

అయోధ్యలో యాత్రికుల కోసం.. 22 దేశీయ, 6 విదేశీ భాషల్లో సైన్ బోర్డులు..

ప్రస్తుత రామజన్మభూమి మందిర శంకుస్థాపన కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉన్నప్పటికీ, 1991లో రామమందిరానికి అనుకూలంగా ఉందని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 1992లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాబ్రీ మసీదు కూలిపోయింది. వీరి ప్రకారం రామమందిరాన్ని అంగీకరించడం తిరస్కరించడం అనేది ఆ పార్టీకి ఓట్లను తెచ్చిపెట్టడమే అంటోంది. 

కారణం ఏంటంటే.. కాంగ్రెస్ ఎప్పుడూ మైనారిటీలను మెప్పించే పార్టీగానే ఉంది. కానీ, బీజేపీకి రామజన్మభూమి అంశం, హిందువుల ఓట్లను పెద్ద ఎత్తుగా కొల్లగొట్టడంగానే ఉంది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో 2019లో సుప్రీంకోర్టు హిందూ పక్షానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిని కాంగ్రెస్ కూడా స్వాగతించింది.

ప్రస్తుతం దేశంలో నెలకొన్న సామాజిక-రాజకీయ కారణాల దృష్ట్యా వాతావరణం కొంచెం భిన్నంగా ఉంది. మైనారిటీలు హిందూ ప్రాబల్యానికి వ్యతిరేకంగా వెనుకడుగు వేశారు. బీజేపీ కాంగ్రెస్‌ను ‘హిందూ వ్యతిరేకి’గా అభివర్ణించింది. బీజేపీ గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ఎజెండాతో గెలిచి చూపించింది. 

ఈ కారణాల నేపథ్యంలో కాంగ్రెస్ రామమందిర ప్రారంభోత్సవాన్ని తిరస్కరించడం అనేది పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ఈ నిర్ణయం వల్ల పెద్ద సంఖ్యలో ఉన్న హిందువులు ఇష్టపడకపోవచ్చు... మరోవైపు సోషలిస్టుగా ఉన్న పార్టీ కంటే ఫండమెంటలిస్ట్ కాషాయ పార్టీపై ప్రజలు తమ విశ్వాసాన్ని చూపించే అవకాశాలు ఎక్కువున్నాయని అంటున్నారు. 

బుధవారం నాడు, రామమందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్, 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రారంభోత్సవాన్ని "బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ కార్యక్రమం"గా రూపొందించిందని తెలిపింది. బి.జె.పి ప్రభుత్వం-సంఘ్ మధ్య జరిగిన సంఘటనలు వీహెచ్ పి, ఆర్ఎస్ఎస్ లు ఆహ్వానాలు పంపండం, వేడుకలు నిర్వహించడంలో రామమందిర శంకుస్థాపన ఆ పార్టీ వ్యక్తిగత కార్యక్రమం అని స్పష్టంగా కనిపిస్తుంది.

"కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ అని ప్రజలను ఒప్పించడం’’లో బిజెపి విజయం సాధించిందని సోనియా గాంధీ గతంలో అంగీకరించారు. ఇప్పుడు ఈ నిర్ణయం కాంగ్రెస్ మనుగడను, ఇండియా కూటమి భవిష్యత్తును ఏం చేయబోతుందనేది.. 2024 లోక్‌సభ ఎన్నికల తరువాత మాత్రమే అర్థం అవుతుంది.

click me!