
ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ చేసిన స్టేట్‌మెంట్ ఇప్పుడు కలకలం రేపుతున్నది. అందించారని శరద్ పవార్ ఓ ప్రకటన చేశారు. నాగ్‌పూర్‌లో ముస్లింల గురించి మాట్లాడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్‌ల గురించి ఏమంటారని ప్రశ్నించారు.
కళను, సినిమాను ఓటు బ్యాంక్ కోసం విభజించడాన్ని ప్రశ్నించారు. ‘దాదా సాహెబ్ ఫాల్కే, కిశోర్ కుమార్, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, స్మితా పాటిల్, మాధురి దీక్షిత్‌ల మొదలైన వారి గురించి ఏమంటారు?’ అని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ట్వీట్ చేశారు. ‘ఉగ్రవాదానికి మతం లేదు కానీ, కళ, సినిమాకు మతం ఉన్నదంటారా పవార్ సాహెబ్?’ అని అడిగారు.
డీ కంపెనీతో లింకులు ఉన్నాయని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ జైలులో ఉన్నారని, అలాంటప్పుడు ఆ పార్టీ అధినేత నుంచి ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేస్తామని పేర్కొన్నారు.
‘ముందు వాళ్లు హిందూ ముస్లిం అని విభజిస్తారు. ఆ తర్వాత క్లాసు రూములుగా విభజిస్తారు. ఆ తర్వాత రాజస్తాన్‌లో ఎలక్ట్రిసిటీని కూడా విభజిస్తారు. ఇప్పుడు ఆర్ట్ లేదా సినిమాను కూడా విభజిస్తున్నారు? బాధాకరం’ అని ఆయన ట్వీట్ చేస్తారు.
అమితాబ్ బచ్చన్, రాజేశ్ ఖన్నా, కిశోర్ కుమార్, లతా మంగేష్కర్‌లను ప్రస్తావిస్తూ ఇండస్ట్రీకి వారు చేసిన కృషిని పవార్ కాదంటారా? అంటూ బీజేపీ నేత రామ్ కాదమ్ అడిగారు. దాదా సాహెబ్ ఫాల్కే ఇండస్ట్రీని సెటప్ చేశాడని పేర్కొన్నారు. వారు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆర్ట్, లేదా ట్యాలెంట్‌ను మతం ఆధారంగా విభజిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఈ ఆలోచనల వెనుక ఉన్న కుట్ర ఏమిటి? అని అడిగారు.