ప్రధాని మోడీని కలవనున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఈ విషయాలను ప్రస్తావించే అవకాశాలు!

By Mahesh KFirst Published Nov 20, 2022, 7:56 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చే నెల 5వ తేదీన భేటీ అయ్యే అవకాశముంది. డిసెంబర్ 5వ తేదీన పీఎం మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యంత్రులతో సమావేశాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లనున్న సీఎం మమతా బెనర్జీ పీఎం మోడీతో సమావేశం అవుతారని తెలుస్తున్నది.
 

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చే నెల 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 5వ తేదీన అన్ని రాష్ట్రాల  ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లుతున్న పశ్చిమ బెంగాల్ సీఎం.. ప్రత్యేకంగా ప్రధాని మోడీతో సమావేశం కావాలని భావిస్తున్నారు.

ప్రధాని మోడీతో సమావేశంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే ఆమె జీఎస్టీ బకాయిల గురించి మాట్లాడారు. కేంద్రం వాటిని విడుదల చేయకుంటే.. ఆ పన్నులను కేంద్రానికి పంపకుండా ఆపే ప్రయత్నాలు చేస్తామని హెచ్చరించారు కూడా. దీనికితోడు గంగా నది పరివాహక ప్రాంతంలో నదీ కోత గురించి కూడా ప్రస్తావించనున్నట్టు తెలుస్తున్నది. ఫరక్కా బ్యారేజీ దగ్గర గంగా నది కోత గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

గంగా నది కారణంగా మాల్దా, ముర్షిదాబాద్,నదియా జిల్లాలో తీరప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. వీటిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖకు ఈ అంశంపై సరైన అధ్యయనం చేసి పరిష్కారానికి ప్రణాళికలు వేయాలని సూచించాలని ప్రధానికి ఆమె ఇటీవలే లేఖ రాశారు.

అలాగే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు చేయడాన్ని కూడా ప్రధాని మోడీ ముందు సీఎం మమతా బెనర్జీ ప్రస్తావించనున్నారు. ఇందుకోసం పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నరు.

వచ్చే ఏడాది భారత దేశం జీ20 సదస్సును నిర్వహించనుంది. ఈ నిర్వహణ ప్రక్రియ ప్రారంభానికి సంబంధించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ వచ్చే నెల 5వ తేదీన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

click me!