బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణ: సువేంద్ ర్యాలీపై రాళ్ల దాడి

By narsimha lodeFirst Published Jan 18, 2021, 7:34 PM IST
Highlights

బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య సోమవారం నాడు ఘర్షణ చోటు చేసుకొంది. రెండు పార్టీల కార్యకర్తలు  రాళ్లు రువ్వుకొన్నారు. త్వరలోనే బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.కోల్‌కత్తాలో బీజేపీ చేపట్టిన రోడ్‌షో హింసాత్మకంగా మారింది. 

కోల్‌కత్తా: బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య సోమవారం నాడు ఘర్షణ చోటు చేసుకొంది. రెండు పార్టీల కార్యకర్తలు  రాళ్లు రువ్వుకొన్నారు. త్వరలోనే బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.కోల్‌కత్తాలో బీజేపీ చేపట్టిన రోడ్‌షో హింసాత్మకంగా మారింది. 

కోల్‌కత్తాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మంత్రి దేవశ్రీ చౌధురి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, మాజీ మంత్రి సువేంద్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

దక్షిణ కోల్‌కత్తాలోని టోలిగంజ్ ప్రాంతంలో ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని స్పష్టంగా తెలుపుతున్నాయని సువేంద్ అధికారి ఆరోపించారు. నందిగ్రామ్ నియోజకవర్గం నుండి మమత బెనర్జీని 50 వేల ఓట్లతో ఓడిస్తానని ఆయన చెప్పారు.

బెంగాల్ లోని నందిగ్రామ్ నుండి పోటీ చేస్తానని సీఎం మమత బెనర్జీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే  ఈ ఘర్షణ చోటు చేసుకొంది. 

ఈ ర్యాలీ నిర్వహించడం కోసం పోలీసుల నుండి అనుమతి తీసుకొన్నట్టుగా బీజేపీ నేత సువేంద్ అధికారి చెప్పారు. కానీ కొందరు తమ ర్యాలీపై రాళ్లు రువ్వారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి ఎత్తుగడలు పనిచేయవని ఆయన స్పష్టం చేశారు.

click me!