సినీ ఫక్కీలో పెళ్లి మండపం నుంచి వధువు తీసుకెళ్లిన ప్రియుడు..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 10, 2020, 09:44 AM IST
సినీ ఫక్కీలో పెళ్లి మండపం నుంచి వధువు తీసుకెళ్లిన ప్రియుడు..

సారాంశం

మండపంలో పెళ్లి జరుగుతుంటుంది.. వరుడు, వధులు పెళ్లి పీటల మీదుంటాడు.. ఇక తాళి కడతారనగా.. వధువు ప్రియుడు ఎంట్రీ.. వెంటనే అతనితో వధువు వెళ్లిపోవడం.. వరుడు బిక్కమొహం వేయడం.. ఇదేంటి సినిమా స్టోరీ అనుకుంటున్నారా? సేమ్ టు సేమ్ ఇలాగే జరిగింది ఉత్తర్ ప్రదేశ్ లో...

వివరాల్లోకి వెడితే.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక పెళ్లి వేడుక జరుగుతుండగా హఠాత్తుగా వధువు ప్రియుడు ప్రత్యక్షమయ్యాడు. పెళ్లి ఆపేసి వధువును తనతో తీసుకెళ్లిపోయాడు. దీంతో వరుడు పెళ్లి జరగకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం వరుడిది ఉన్నావ్ జిల్లా. వధువుది లక్నో.  మడపంలో సరిగ్గా దండలు మార్చుకునే సమయానికి ముందు చెప్పినట్టుగా అచ్చు సినీస్టయిల్‌లో వధువు ప్రియుడు వచ్చాడు. అతన్ని చూస్తూనే వధువు వణికిపోయింది. వచ్చిన ప్రియుడు నేరుగా వధువు దగ్గరకు వచ్చి ఆమెను కారులో కూర్చోబెట్టుకుని వెళ్లిపోయాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. 

మరో ట్విస్ట్ ఏంటంటే ఈ ఘటనపై స్పందించిన వధువు తండ్రి రామేశ్వరం తన కుమార్తెకు ఆ యువకునితోనే వివాహం జరిపించాలనుకుంటున్నామని తెలిపారు. కాగా ఇంత జరిగినా ఏమనుకున్నారో తెలియదు కానీ వరుని తరపువారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. ఈ  ఘటనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?