
Chintan Shivir: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పార్టీని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ మూడు రోజుల మేధోమథనం సెషన్ 'చింతన్ శివిర్'ను నిర్వహిస్తోంది.ఈ క్రమంలోనే 2024 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించే అంతర్గత సంస్కరణల అమలుకు మరో రెండు మూడు రోజుల్లో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ చింతన్ శివిర్‌లో తన ముగింపు ప్రసంగంలో తెలిపారు. ఈ అంతర్గత సంస్కరణల సంస్థ నిర్మాణం, పార్టీ పదవులకు నియామకాల నియమాలు, కమ్యూనికేషన్లు మరియు ప్రచారం,ఆర్థిక మరియు ఎన్నికల నిర్వహణతో సహా అన్ని అంశాలను ఈ టాస్క్‌ఫోర్స్ కవర్ చేస్తుందని ఆమె చెప్పారు.
“అత్యవసరమైన అంతర్గత సంస్కరణల ప్రక్రియను నడపడానికి ఒక కాంపాక్ట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడుతుంది. ఉదయపూర్‌లో జరిగిన సమావేశంలో వివిధ సమూహాలలో దీని గురించి చర్చించబడింది. ఈ సంస్కరణలు 2024 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారిస్తాయి.. ఇది అన్ని అంశాలను కవర్ చేస్తుంది. టాస్క్‌ఫోర్స్ కూర్పుపై వచ్చే రెండు-మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది” అని సోనియగా గాంధీ ఉదయపూర్‌లో చెప్పారు.అలాగే, "మేము అన్ని సమస్యలను, సవాళ్లను అధిగమిస్తాము. అది మా సంకల్పం. అదే మన నవసంకల్పం. కాంగ్రెస్ కు సరికొత్త ఉదయం రాబోతోంది. అదే మా నవసంకల్పం” అని సోనియా గాంధీ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుల నుండి ఒక సలహా బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సోనియా గాంధీ ప్రకటించారు. ఇది రాజకీయ విషయాలను చర్చించడానికి క్రమం తప్పకుండా సమావేశమవుతుందని పేర్కొన్న ఆమె.. ఇది సమిష్టి నిర్ణయాధికార సంస్థ కాదనీ, విస్తారమైన ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుందని నొక్కి చెప్పారు. "మా పార్టీ ముందున్న రాజకీయ సమస్యలు మరియు సవాళ్లపై చర్చించడానికి నా అధ్యక్షతన క్రమం తప్పకుండా సమావేశమయ్యే CWC నుండి ఒక సలహా బృందాన్ని నియమించాలని కూడా నేను నిర్ణయించుకున్నాను" అని ఆమె చెప్పారు. "మాకు CWC ఉంది, అది ఎప్పటికప్పుడు సమావేశమవుతుంది.. ఇక ముందు వరుస సమావేశాలు కొనసాగుతాయి అని స్పష్టం చేశారు.
అయితే, కొత్తగా ఏర్పడే ఈ బృందం సమిష్టి నిర్ణయం తీసుకోదని పేర్కొంటూ.. సీనియర్ల అపారమైన అనుభవాన్ని పొందడంలో తమకు సహాయం చేస్తుందని తెలిపారు. సోనియా గాంధీ ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల చింతన్ శివిర్‌ను ఉపయోగకరమైన మరియు ఉత్పాదకమైనదిగా పేర్కొన్నారు. ఎందుకంటే చాలా మంది పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి మరియు నిర్మాణాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో సూచనలను అందించడానికి అవకాశం ఏర్పడిందని తెలిపారు. ఈ సమావేశాల్లో తీసుకున్న ముఖ్య నిర్ణయాల్లో కాంగ్రెస్ దేశవ్యాప్త యాత్ర కొనసాగించడం. దీని ద్వారా సమాన్య ప్రజానీకం దగ్గరకు కాంగ్రెస్ వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. ఈ దేశవ్యాప్త యాత్ర అక్టోబర్ 2 నుంచి కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు కొనసాగుతుందని సోనియా గాంధీ వెల్లడించారు. కాంగ్రెస్‌కు సామాన్యులతో సంబంధాలు తెగిపోయాయని, ప్రజల్లోకి వెళ్లడం ద్వారా దాన్ని సరిదిద్దాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీని కోసం దేశవ్యాప్త యాత్ర చేయనున్నట్టు పేర్కొన్నారు. అక్టోబర్‌లో కాంగ్రెస్ దేశవ్యాప్త యాత్ర షురు అవుతుందని తెలిపారు.