రెండు శాతం కూడా లెక్కించడం లేదు... అభిషేక్ మనుసింఘ్వీ

By telugu teamFirst Published May 7, 2019, 3:25 PM IST
Highlights

వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వీ మండిపడ్డారు. 

వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వీ మండిపడ్డారు. కనీసం రెండు శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించడం లేదని ఆయన మంగళవారం సుప్రీం కోర్టుకు తెలిపారు.

యాభై శాతం ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్లను లెక్కించాల్సిందేనని..22 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై అభిషేక్‌ మనుసింఘ్వీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషన్ అమలుచేయకపోతే ఏం చేయాలని ప్రశ్నించారు. 

ఎలాంటి చర్యలు తీసుకోవాలో మార్గదర్శకాలు ఇవ్వాలని .. సుప్రీంకోర్టును ఆయన కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం విపక్షాల రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది. సుప్రీం కోర్టు తీర్పుపై విపక్ష నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.

click me!