Goa Election Result 2022 ప్రజల తీర్పును అంగీకరిస్తాం: కాంగ్రెస్ నేత పి.చిదంబరం

Published : Mar 10, 2022, 05:19 PM IST
Goa Election Result 2022  ప్రజల తీర్పును అంగీకరిస్తాం: కాంగ్రెస్ నేత పి.చిదంబరం

సారాంశం

గోవా ప్రజలు ఇచ్చిన తీర్పుు తాము అంగీకరిస్తామని మాజీ మంత్రి పి. చిదంబరం చెప్పారు. గోవా ఎన్నికల ఫలితాలపై ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.

న్యూఢిల్లీ: గోవాలో ప్రజల తీర్పును తాము అంగీకరిస్తామని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చిదంబరం చెప్పారు.గురువారం నాడు సాయంత్రం గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై Chidambaram మాట్లాడారు. Congress కు ఓటేయాలని ప్రజల్లోకి మరింత విస్తృతంగా ప్రచారాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విపక్షాల అనైక్యత కూడా BJP కి కలిసి వచ్చిందని చిదంబరం అభిప్రాయపడ్డారు. Votes చీలడం వల్లే బీజేపీకి గెలుపు సాధ్యమైందని ఆయన చెప్పారు.  గోవా ప్రజలు మార్పు కోరుకున్నారని ఎన్నికల ఫలితాల సరళిని బట్టి తేలిందన్నారు.  Goaలో 33 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. 

గోవా రాష్ట్రంలో 20 స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధఇంచారు. కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించింది.ఆప్, టీఎంసీ రెండేసి స్థానాల్లో విజయం సాధించారు. ఇండిపెండెంట్లు నాలుగు స్ధానాల్లో గెలుపొందారు.


ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు విడతల పోలింగ్‌తో ముగియగా.. ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలు గత నెల 14వ తేదీన సింగిల్ ఫేజ్‌లో ముగిశాయి. 

పర్యాటక రాష్ట్రంగా పేర్గాంచిన గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ లేదా కూటమి అయినా 21 సీట్లు సాధిస్తే
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఫిబ్రవరి 14న జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 79%గా నమోదైంది.
అత్యధికంగా సీఎం ప్రమోద్ సావంత్ పోటీ చేసిన నియోజకవర్గంలో 89.64 శాతంగా రికార్డ్ అయింది. అయితే,
ఈ సారి పోలింగ్ శాతం గత ఎన్నికల్లో(81.21శాతం) కంటే తగ్గింది.

గోవాలో అధికారంలో బీజేపీ ఉన్నది. సీఎంగా ప్రమోద్ సావంత్ ఉన్నారు. ఆయన గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం
నుంచే మరోసారి బరిలోకి దిగారు. కాగా, గోవా మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ మరణం
తర్వాత ఆయన కుమారుడు ఉత్పల్ పారికర్ తండ్రి పోటీ చేసిన పనాజీ నుంచే బరిలోకి దిగారు. పనాజీ నుంచి బీజేపీ
ఆయనకు టికెట్ నిరాకరించడంతో స్వతంత్రంగా పోటీ చేశారు. కాంగ్రెస్ సీఎం ఫేస్‌ను ఇంకా ప్రకటించలేదు. ఆప్ మాత్రం అమిత్ పాలేకర్‌ను సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించింది.

రాష్ట్రంలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచే కాకుండా, స్వతంత్రంగా 301 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక్కడ బీజేపికి కాంగ్రెస్, మహారాష్ట్రవాది గోమంత్ పార్టీ, టీఎంసీ, ఆప్ పార్టీలు తలపడ్డాయి.

గోవా రాజకీయాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల బెడద ఎక్కువ. ఇక్కడ పార్టీల కంటే రాజకీయ నేతలకే ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది.  నియోజకవర్గాలు చిన్నగా ఉండటంతో నేతలకే ప్రజలతో నేరుగా ఉండే సంబంధాలు ఎక్కువ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 17 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ, 13 సీట్లు గెలుపొందిన బీజేపీ అధికారాన్ని చేపట్టింది.

తొలుత చిన్న పార్టీలతో జత కట్టి బీజేపీ అధికారాన్ని చేపట్టగా.. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచే పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 19కు చేరగా.. కాంగ్రెస్ పార్టీఎమ్మెల్యేల సంఖ్య 2కు పడిపోయింది. ఇదిలా ఉండగా, తృణమూల్ కాంగ్రెస్  ఈ రాష్ట్రంపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కూడా ఇక్కడ ప్రచారం చేయడం గమనార్హం. ఆప్ కూడా గోవాలో ప్రచారం ముమ్మరంగా చేపట్టింది.
 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu