The Kerala Story: ముందు సినిమా చూడండి.. ఆ తర్వాత కామెంట్ చేయండి: అదా శర్మ

Published : May 16, 2023, 02:33 PM ISTUpdated : May 16, 2023, 03:04 PM IST
The Kerala Story: ముందు సినిమా చూడండి.. ఆ తర్వాత కామెంట్ చేయండి: అదా శర్మ

సారాంశం

ది కేరళ స్టోరీ సినిమా హీరోయిన్ అదా శర్మ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా చూడకుండానే కామెంట్లు వద్దని, సినిమా చూసి మాట్లాడాలని వివరించింది. ఉగ్రవాదమే లేదనే వారు సినిమా చూసి తమ అభిప్రాయాలు మార్చుకోవచ్చని తెలిపింది.  

న్యూఢిల్లీ: ది కేరళ స్టోరీ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే వివాదంలో చిక్కుకుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ సినిమాపై నిషేధం విధించారు. ఈ సినిమాకు సుదిప్తో సేన్ దర్శకత్వం వహించగా.. ప్రధాన పాత్రలో అదా శర్మ నటించారు. ఈ సినిమాపై బ్యాన్ గురించి ఆమె స్పందిస్తూ.. భావ ప్రకటన స్వేచ్ఛను సెలెబ్రేట్ చేసుకోవాలని తెలిపారు. ముందు సినిమా చూడాలని, ఆ తర్వాత ఏ కామెంట్ అయినా చేయాలని ఆమె వివరించారు.

మే 8వ తేదీన పశ్చిమ బెంగాల్ఈ సినిమా బ్యాన్ చేసింది.  రాష్ట్రంలో మత విద్వేషం, హింసాత్మక ఘటనల నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అలాగే, తమిళనాడులోనూ ఈ సినిమాపై నిషేధం ఉన్నది. తమిళనాడు థియేటర్ అండ్ మల్టిప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ ఈ సినిమా స్క్రీనింగ్‌ను ఆపేశారు. 

ఈ సినిమా బ్యాన్ చేయడానికి గల కారణాలు తెలపాలని పశ్చిమ బెంగాల్‌కు, థియేటర్‌ల భద్రతకు తీసుకున్న చర్యలేవో వివరించాలని తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ సందర్భంలో అదా శర్మ మాట్లాడుతూ.. తానేమీ అధికారిని కాదని, కానీ, తన అభిప్రాయం ప్రకారం భావప్రకటన స్వేచ్ఛను సెలబ్రేట్ చేసుకోవాలని, సినిమా అందరూ చూసి ఆ తర్వాత పాజిటివ్ లేదా నెగెటివ్ కామెంట్ చేయాలని అన్నారు. 

అదా శర్మ ఈ సినిమాలో ఫాతిమా బా అనే పాత్ర పోషించారు. మలయాళీ హిందూ నర్సింగ్ స్టూడెంట్‌‌గా ఆమె పాత్ర ఉంటుంది. ఆ ఫాతిమా బా కేరళ నుంచి కనిపించకుండా పోతుంది. ఆమెను ఇస్లాంలోకి మార్చి ఐఎస్ఐఎస్‌లోకి రిక్రూట్ చేసుకుంటారు. 

Also Read: నా సింప్లిసిటీ చూసి ప్రధానికి అత్తనంటే ఎవరు నమ్మలేదు - సుధామూర్తి

‘మనం సెన్సార్ బోర్డును గౌరవించాలి. ఈ సినిమా బ్యాన్ చేయాలనుకునేవారు ఒక సారి ఈ మూవీ చూస్తే వారి అభిప్రాయాన్ని మార్చుకుంటారని వివరించారు. ఈ సినిమా ఉగ్రవాదం గురించి చర్చిస్తుందని, కాబట్టి, ఇంకా స్క్రీన్లు పెంచాలని డిమాండ్ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

‘మనం అదృష్టవశాత్తు ఒక ప్రజాస్వామిక దేశంలో నివసిస్తున్నాం. ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. సినిమాలో తన కేరెకేర్ వెళ్లిన దేశం కాదని’ అని ఆమె తెలిపారు.

ఈ సినిమా మానవత్వం, ఉగ్రవాదం గురించి అని, ప్రేమలో మోసపోవడం గురించి అని, ఎవరిని రేప్ చేయవద్దనే సందేశం ఇచ్చే సినిమా అని అదా శర్మ వివరించారు. ఇలాంటివి జరిగాయనే దాన్ని నమ్మలేని వారి గురించి మాట్లాడుతూ. . వారు  ఐఎస్ఐఎస్ బ్రైడ్స్ అని గూగుల్‌లో వెతకాలని, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద చెరలో చిక్కుకున్న యువతుల అకౌంట్లు వస్తాయని వివరించారు. 
 
బాధితుల తల్లిదండ్రుల వాంగ్మూలాలను పేర్కొన్న తమ చిత్రం చూసిన వారెవరూ ఇలా మాట్లాడరని చెప్పారు. ఉగ్రవాదమే లేదని చెప్పేవారు తమ సినిమా చూసి అభిప్రాయాలు మార్చుకోవచ్చని అన్నారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu