మహిళను తుపాకీతో బెదిరించిన మాజీ ఎంపీ కొడుకు(వీడియో)

Published : Oct 16, 2018, 02:04 PM IST
మహిళను తుపాకీతో బెదిరించిన మాజీ ఎంపీ కొడుకు(వీడియో)

సారాంశం

ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అతడి ప్రవర్తన పట్ల నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

మాజీ ఎంపీ కొడుకు.. ఫైవ్ స్టార్ హోటల్ ముందు తుపాకీతో  వీరంగం సృష్టించాడు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అతడి ప్రవర్తన పట్ల నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దిల్లీలోని  ఫైవ్ స్టార్ హోటల్‌ వద్ద బీఎస్పీ మాజీ ఎంపీ కుమారుడైన ఆశిష్‌ పాండే తుపాకీతో ఓ జంట పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. వారితో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో తెలుస్తోంది.

 

ఆశిష్‌తో ఉన్న మరో మహిళ అతడిని ఆపేందుకు ప్రయత్నించింది. ఆశిష్‌ ఆ మహిళను బెదిరిస్తూ, తిడుతూ ఉండడంతో హోటల్‌ సిబ్బంది కూడా అతడిని అక్కడి నుంచే పంపించే ప్రయత్నం చేసినట్లు వీడియోలో రికార్డైంది. ఆదివారం రాత్రి ఓ పార్టీ అయిపోయిన తర్వాత హోటల్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పది సెకన్ల ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దిల్లీ పోలీసులు స్పందించారు. ఆశిష్‌ పాండేపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతడిని అరెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?