డాక్టర్ పాయల్‌ తాడ్వీ కేసు: పోస్టు మార్టంలో కీలక అంశాలు

By narsimha lodeFirst Published May 30, 2019, 4:39 PM IST
Highlights

ముంబైకి చెందిన డాక్టర్ పాయల్ తాడ్వీ కేసు కీలక మలుపు తిరిగింది. పాయల్‌ది ఆత్మహత్య కాదు... హత్యే అనే అనుమానాలు వ్యక్తమౌతున్న తరుణంలో  పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

ముంబై: ముంబైకి చెందిన డాక్టర్ పాయల్ తాడ్వీ కేసు కీలక మలుపు తిరిగింది. పాయల్‌ది ఆత్మహత్య కాదు... హత్యే అనే అనుమానాలు వ్యక్తమౌతున్న తరుణంలో  పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

పాయల్ గొంతు దగ్గర, శరీరంపై గాయాలు ఉన్నట్టుగా పోస్ట్‌మార్టం రిపోర్టు‌ వెల్లడించింది.  పాయల్‌ కుటుంబం తరపు న్యాయవాది పాయల్‌ మృతిని హత్యగా గుర్తించాలని కోర్టును కోరారు.

పాయల్ మరణించిన తీరును ఆమె శరీరం మీద ఉన్న గాయాలను చూస్తే తనది ఆత్మహత్య కాదని.... హత్య అని తెలుస్తోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రస్తుతం హత్య కోణంలో పోలీసులు కూడ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు 14 రోజుల గడువును ఇవ్వాలని కోరారు. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

స్థానిక బీవైఎల్ నాయర్ ఆసుపత్రివలో వైద్య విద్యలో పీజీ చదువుతున్న పాయల్ తాడ్వీని సీనియర్లు కులం పేరుతో వేధించడంతో పాయల్ ఈ నెల 22వ తేదీన హస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకొన్నారు.
 

click me!