నూతన వ్యవసాయ చట్టాలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Jan 12, 2021, 1:42 PM IST
Highlights

వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల సంఘాలు, కేంద్రం వాదనలను విన్పించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. 

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల సంఘాలు, కేంద్రం వాదనలను విన్పించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. చట్టంలోని ఏ భాగాలను తొలగించాలో కమిటీ నిర్ణయిస్తోందన్నారు. ఏది ఉంచాలో ఆ కమిటీ నిర్ణయం తీసుకొంటుందన్నారు 

మంగళవారం నాడు రైతుల ఆందోళనలపై  సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ చట్టాలు చేయాలో తాము ప్రభుత్వానికి చెప్పలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

నిర్ధిష్టమైన ప్రయోజనం లేకుండా చట్టాలను సస్పెండ్ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సోమవారం నాడు రైతుల ఆందోళనల విషయమై కేంద్రానికి చురకలు అంటించింది సుప్రీంకోర్టు .కానీ ఇవాళ రైతులకు సుప్రీంకోర్టు చురకలు అంటించింది.

కమిటీ నియమించే అధికారం తమకు ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఢిల్లీలో ఆందోళనలకు అనుమతి అడిగారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వ్యవసాయ చట్టాలను శాశ్వతంగా నిలిపివేయలేమని సుప్రీంకోర్టు కోర్టు తెలిపింది.

చట్టాలను నిలిపివేసే అధికారం కూడా ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తెలిపింది.అవసరమైతే కొంతకాలం చట్టం అమలును నిలిపివేయగలమని సుప్రీంకోర్టు తెలిపింది.

రైతుల నిరసనల్లో నిషేధిత సంస్థలు చొరబడ్డాయనే ఆరోపణలపై కేంద్రం స్పందన కోరింది సుప్రీంకోర్టు.ఈ నెల 26 తేదీన ట్రాక్టర్ ర్యాలీని రైతు తలపెట్టారు.ఈ విషయమై సుప్రీంకోర్టు రైతు సంఘాలకు నోటీసులు జారీ చేసింది. ట్రాక్టర్ ర్యాలీని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయమై సోమవారం నాడు విచారణ చేయనున్నట్టుగా సుప్రీంకోర్టు ప్రకటించింది.

కాంట్రాక్టు వ్యవసాయం కోసం రైతుల భూమిని అమ్మలేమని మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. 
 

click me!