అది అశ్లీలం కాదు... వల్గారిటీ మాత్రమే.. రాజ్ కుంద్రా న్యాయవాది..!

By telugu news teamFirst Published Jul 22, 2021, 8:01 AM IST
Highlights

శృంగారంలో పాల్గొంటే మాత్రమే దానిని పోర్న్ అని అంటారు.. అలా కాకుండా చూపించేదానికి వల్గారిటీ అని మాత్రమే అంటారని ఆయన పేర్కొన్నారు.

అశ్లీల చిత్రాలు తీస్తున్నారనే కారణంతో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన అరెస్టుపై అతని న్యాయవాది అబాద్ పోండా అభ్యంతరం వ్యక్తం చేశారు. 

రాజ్ కుంద్రా నిర్మించినది కేవలం వెబ్ సిరీస్ లాంటిదేనని కాకపోతే.. అందులో కాస్త అసభ్య చిత్రాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని.. అంతేకానీ అది పోర్న్ కాదని పేర్కొన్నారు. ఆ వీడియోల్లో నటులు.. ఎలాంటి శృంగారంలో పాల్గొనలేదని.. అలాంటప్పుడు అది పోర్న్ ఎలా అవుతుందని రాజ్ కుంద్రా తరపు న్యాయవాది వాదించారు.

ఈ కేసును సెక్షన్ 67ఏ కింద పరిగణించడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. ఐటీ చట్టాలను.. ఐపీసీ చట్టాల కింద పరిగణించకూడదని ఆయన పేర్కొన్నారు. శృంగారంలో పాల్గొంటే మాత్రమే దానిని పోర్న్ అని అంటారు.. అలా కాకుండా చూపించేదానికి వల్గారిటీ అని మాత్రమే అంటారని ఆయన పేర్కొన్నారు.

ఈ రోజుల్లో అన్ని వెబ్ సిరీస్ లలో అసభ్య కంటెంట్ ఉంటుందని.. ఇది కూడా అలాంటిదేనని ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు సంభోగంలో పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా... రాజ్ కుంద్రా ఈ కేసుకు సంబంధించిన ముందస్తు బెయిల్ అప్లై చేశారు. ఇప్పటి వరకు అయితే.. బెయిల్ మంజూరు కాలేదు.

కాగా.. ‘హాట్ షాట్స్’ పేరిట అశ్లీల వీడియోలను రాజ్ కుంద్రా ప్రసారం చేస్తున్నారని ముంబయి పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆయన ఈ నేరం చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో శిల్పా శెట్టి పాత్ర మాత్రం పెద్దగా లేదని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు.

కాగా.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 11మందిని అరెస్టు చేశారు. కుంద్రా సన్నిహితుడు, వారి సంస్థకు సంబంధించిన ఐటీ పనులు చూసుకుంటున్న ర్యాన్ తోర్పేను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 

click me!