బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020:40 అసెంబ్లీ సీట్లలో జేడీ(యూ) ను దెబ్బతీసిన ఎల్‌జేపీ

By narsimha lodeFirst Published Nov 11, 2020, 2:03 PM IST
Highlights

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. ఎల్జేపీ జేడీ(యూ)కు చెందిన ఓట్లను చీల్చిందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.


పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. ఎల్జేపీ జేడీ(యూ)కు చెందిన ఓట్లను చీల్చిందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎల్జేపీ నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అదే సమయంలో బీజేపీకి అనుకూలమని ఆయన ప్రకటించారు.

జేడీ(యూ)ను దెబ్బతీసే క్రమంలోనే ఎల్జేపీ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ  కంటే జేడీ(యూ) తక్కువ సీట్లకు పరిమితం కావడానికి ఎల్జేపీ పాత్రను కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

రాష్ట్రంలోని  135 అసెంబ్లీ స్థానాల్లో ఎల్జేపీ పోటీ చేసింది. అయితే ఎల్ జే పీ 13 స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చినట్టుగా ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది. కొన్ని స్థానాల్లో ఎల్జేపీ పోటీ కారణంగా జేడీ(యూ)  మూడో స్థానంలోకి వెళ్లింది.

బీజేపీ, జేడీ(యూ) పొత్తు కారణంగా టికెట్లు దక్కని కారణంగా  ఎల్జేపీ టికెట్లపై కొందరు పోటీ చేశారని సమాచారం.నితీష్ ను లక్ష్యంగా చేసుకొని ఎల్జేపీ ప్రచారం చేసింది.

మంగళవారం రాత్రి పది గంటల వరకు అందిన గణాంకాల ఆధారంగా 40 అసెంబ్లీ సీట్లలో జేడీ(యూ) విజయావకాశాలను ఎల్ జే పీ దెబ్బతీసింది. జేడీ(యూ) 27 సీట్లలో గెలిచి మరో 16 సీట్లలో ఆధిక్యంలో ఉంది.

పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయం వెనుక బీజేపీ ఆశీర్వాదాలు ఉన్నాయని కాంగ్రెస్ బహిరంగంగానే విమర్శలు చేసింది.తాను బీజేపీకి వ్యతిరేకం కాదని, నితీష్ కుమార్ కు మాత్రమే వ్యతిరేకమని పాశ్వాన్ చేసిన ప్రకటనను కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి.

నితీష్ కుమార్ పై  పాశ్వాన్ ఎన్నికల ప్రచార సభల్లో తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయలేదు. నితీష్ ను ఓడించడమే తన లక్ష్యమని పాశ్వాన్ తీవ్ర విమర్శలు చేశారు.

బీహార్ లోని దర్బాంగ గ్రామీణ,ఎక్మా, గైఘాట్, ఇస్లాంపూర్, మహారాజ్ గంజ్, మహిషి, సుల్తాంగంజ్, సాహెబ్ పూర్, కమల్, రాజపకర్, మాతిహాని, మోర్వా, నాథ్ నగర్, పర్బట్టా, లౌకా, మహానార్, మహువా, కద్వా సీట్లలో జేడీ(యూ) విజయావకాశాలను ఎల్ జే పీ దెబ్బకొట్టింది.

also read:మమ్మల్ని అంటరాని పార్టీగా చూశారు: అసదుద్దీన్ ఓవైసీ

దర్బంగ గ్రామీణ ప్రాంతంలో ఆర్జేడీ అభ్యర్ధి లలిత్ కుమార్ యాదవ్ కు 64,929 ఓట్లు, జేడీ(యూ) అభ్యర్ధి ఫరాజ్ పాత్మికి 62,788 కి ఓట్లు వచ్చాయి. ఎల్ జే పీ అభ్యర్ధి ప్రదీప్ కుమార్ కు 17,506 ఓట్లు సాధించారు.

ఏక్మా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్ధి శ్రీకాంత్ యాదవ్ కు 53,875 ఓట్లు వచ్చాయి. జేడీయూ అభ్యర్ధి సీతా దేవికి 39,948  ఓట్లు లభించాయి. ఎల్ జే పీ అభ్యర్ధి కామేశ్వర్ సింగ్ కు 29,9992 ఓట్లు వచ్చాయి.

గయఘట్ నియోజకవర్గంలో  ఆర్జేడీ అభ్యర్ధి నిరంజన్ రాయ్ కు 50,433కి ఓట్లు వచ్చాయి. జేడీ యూ అభ్యర్ధి మహేశ్వర్ పీడీ యాదవ్ కు 44,658 కి దక్కాయి.  ఎల్ జే పీ అభ్యర్ధి కోోమల్ సింగ్ కు 32,242 కి వచ్చాయి.

ఇస్లాంపూర్ లలో ఆర్జేడీ అభ్యర్ధి రితేష్ కుమార్ రోషన్ కు  68,088 ఓట్లు వచ్చాయి. జేడీ యూ అభ్యర్ధి చంద్రసేన్ ప్రసాద్ కు 64,390 ఓట్లు దక్కాయి. ఎల్ జే పీ అభ్యర్ధికి 8,597 ఓఓట్లు వచ్చాయి.

మహారాజ్ గంజ్ లో విజయ్ శంకర్  దుబే కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశాడు. ఆయనకు 48,825 ఓట్లు దక్కాయి. జేడీ యూ కు చెందిన నారాయణ్ షా కు 46,849 ఓట్లు వచ్చాయి. ఎల్ జేపీ అభ్యర్ధి డియో రంజన్  సింగ్ కు 18, 190 ఓట్లు వచ్చాయి.జేడీ(యూ) తో పాటు ఎల్ జే పీ తో పాటు ఎన్డీఏ  మిత్రపక్షాలైన హిందూస్థానీ అవామ్ మోర్చా ,వికాషీల్ ఇన్సాన్ ల ను కూడ దెబ్బతీసిందని గణాంకాలు చెబుతున్నాయి.

 

click me!