వలస కూలీకి పురుడు పోసిన ఆటోడ్రైవర్, బాషా సినిమా లెవెల్ లో అతడి జీవిత కథ

By Sree s  |  First Published Apr 18, 2020, 3:42 PM IST

తమిళనాడు నుంచి ఒరిస్సాలోని తమ సొంత ఊరికి నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీల్లో ఒకామె నిండు చూలాలు. ఆమె నడుస్తూ కోయంబత్తూర్ నగరంలో పురిటి నొప్పులతో బాధపడుతూ కుప్పకూలిపోయింది. 


కరోనా లాక్ డౌన్ వల్ల ఎక్కడెక్కడో చిక్కుకున్న వలస కార్మికులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తమ స్వస్థలాలకు నడుచుకుంటూ రాష్ట్రాలు దాటుకుంటూ వెళ్తున్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాము. 

ఇలా తమిళనాడు నుంచి ఒరిస్సాలోని తమ సొంత ఊరికి నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీల్లో ఒకామె నిండు చూలాలు. ఆమె నడుస్తూ కోయంబత్తూర్ నగరంలో పురిటి నొప్పులతో బాధపడుతూ కుప్పకూలిపోయింది. 

Latest Videos

విషయం తెలుసుకున్న ఆటోడ్రైవర్ అక్కడకు చేరుకొని ఆమెకు పురుడు పోసాడు. ఈ ఘటన కోయంబత్తూర్ పట్టంలో స్థానిక సిపిఐ పార్టీ ఆఫీస్ వద్ద జరిగింది. పురుడు పోసి తల్లి బిడ్డలను కాపాడిన ఆటోడ్రైవర్ చంద్రాన్ని అందరూ అభినందించారు. 

వివరాల్లోకి వెళితే కోయంబత్తూరులో ఆటో చంద్రన్ అనే ఆటోడ్రైవర్ మంచితనానికి మారుపేరు. ఆయన కవి కూడా ఆయన రాసిన లాక్ అప్ అనే పుస్తకం ఆధారంగా విసరనాయి అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. 

సామాజిక కార్యకర్త అయిన చంద్రన్ లాక్ డౌన్ వేళ ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ఆహారాన్ని అందించే పనిలో ఉండగా అతడికి ఈ సమాచారం అందింది. సిపిఐ పార్టీ ఆఫీస్ వద్ద ఒక వలసకూలీ పురిటి నొప్పులతో బాధపడుతుందని తెలుసుకొని అక్కడకు వెళ్ళాడు. 

కానీ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలి అనుకున్న చంద్రన్ కి ఆమె అప్పటికే పురిటి నొప్పులతో తల్లడిల్లుతుండడం చూసి ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం లేదని గ్రహించి ఆమెకు అక్కడే పురుడు పోసాడు. 

తాను పురుడు పొసే సమయంలో ఆలస్యం కాకుండా అదే సమయంలో అంబులెన్సు కి ఫోన్ చేసాడు. పురుడు పోసాక..... , వచ్చిన అంబులెన్సు లో తల్లి బిడ్డలిద్దరినీ కోయంబత్తూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

చంద్రన్ చేసిన ఈ గొప్ప కార్యం ఆయన కూతురు సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఈయన తన జీవితం ఆధారంగా పోలీసులు కొందరు యువకులను చెయ్యని నేరాన్ని ఒప్పుకోవాలని ఎలా హింసించారో తన నిజజీవిత గాథ ఆధారంగా లాక్ అప్ అనే పుస్తకాన్ని రాసాడు. ఆ పుస్తకాన్ని చదివిని దర్శకుడు వెట్రి మారన్ విసరనై అనే సినిమా కూడా తీసాడు. 

click me!