వైర‌ల్ వీడియో: లిఫ్ట్ లో యువ‌కునిపై దాడి చేసిన పెంపుడు కుక్క

Published : Sep 07, 2022, 04:52 PM IST
వైర‌ల్ వీడియో:  లిఫ్ట్ లో యువ‌కునిపై దాడి చేసిన పెంపుడు కుక్క

సారాంశం

వైర‌ల్ వీడియో: లిఫ్ట్‌లో మరో పెంపుడు కుక్క దాడి చేసిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ఈసారి నోయిడా హౌసింగ్ సొసైటీలో పెంపుడు కుక్క దాడి ఘ‌ట‌న చోటుచేసుకుంది. కుక్క యజమాని తన పెంపుడు జంతువును నియంత్రించడానికి-లిఫ్ట్ నుండి బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపించింది. 

న్యూఢిల్లీ: ఇటీవ‌లి కాలంలో పెంపుడు జంతువుతు మ‌నుషుల‌పై దాడులు చేస్తున్న ఘ‌ట‌న‌లు అధికంగా వెలుగుచూస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా దేశ రాజ‌ధాని ప్రాంతం ఎన్సీఆర్ ప‌రిధిలో పెంపుడు జంతువులు దాడుల‌కు పాల్ప‌డుతున్న ఘ‌ట‌న‌లు వ‌రుస‌గా చోటుచేసుకుంటుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. జాతీయ రాజధాని ప్రాంతంలో పెంపుడు కుక్కల దాడి ఘటనలు పెరుగుతున్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటీ లిఫ్ట్‌లో పెంపుడు కుక్క బాలుడిని కరిచినట్లు చూపించే షాకింగ్ వీడియో కొన్ని రోజుల తరువాత.. అలాంటి మ‌రో ఘ‌ట‌న‌ నోయిడాలో కూడా చోటుచేసుకుంది. లిఫ్టులో  యువ‌కునిపై కుక్క దాడికి సంబంధించిన మరొక వీడియో బయటికి వచ్చింది. నోయిడాలోని సెక్టార్ 75లోని అపెక్స్ ఎథీనా సొసైటీలో చోటుచేసుకున్న తాజా ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. 

ఆ వీడియో దృశ్యాల్లో ఒక బాలుడు కుక్కను పట్టుకొని ఉన్నాడు. మ‌రొక వ్యక్తి దానికి దూరంగా, లిఫ్ట్ డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. లిఫ్ట్ ఆపి, బాలుడు బయటకు రావడానికి కదులుతున్నప్పుడు, కుక్క మనిషి వైపు దూసుకువ‌చ్చింది. అత‌నిపై దాడికి పాల్ప‌డింది. దీంతో ఆ యువ‌కుడు ఆ కుక్క దాడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేలపై పడిపోయాడు. అయితే, ఆ యువ‌కుడిని కుక్క కరిచిందా?  లేదా? అనేది వీడియోలో స్పష్టంగా క‌నిపించ‌డం లేదు. కానీ, ఆ యువ‌కుడు మాత్రం లిఫ్ట్ లో నేల‌పై ప‌డిపోవ‌డంతో గాయాలు అయిన‌ట్టు తెలుస్తోంది. కుక్క యజమాని తన పెంపుడు జంతువును నియంత్రించడానికి.. లిఫ్ట్ నుండి బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియో దృశ్యాల్లో క‌నిపించింది. 

ఇటీవ‌ల‌, ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న చార్మ్స్ క్యాజిల్ సొసైటీకి చెందిన లిఫ్ట్‌లో ఉన్న ఒక మహిళ తన కుక్క దూకి అతన్ని కరిచిన తర్వాత అతనికి సహాయం చేయనందుకు దూషించిన రెండు రోజులకే ఈ సంఘటన జరిగింది. బాలుడు నొప్పితో విలపిస్తున్నప్పటికీ క్షమాపణలు చెప్పకుండా లిఫ్ట్‌లో నుండి ఆమె ప్ర‌శాంతంగా బయటకు రావడం కనిపించింది. ఈ దృశ్యాలు ఘజియాబాద్ పోలీసుల నుండి ప్రతిస్పందనను ప్రేరేపించాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

 

హిందీలో చేసిన ట్వీట్‌లో, నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్ ముందస్తు చట్టపరమైన చర్యలు తీసుకుంటోందని వారు తెలిపారు. జాతీయ రాజధాని ప్రాంతంలో పెంపుడు కుక్కల దాడి ఘటనలు పెరుగుతున్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..