లీజుకు రైల్వే భూములు.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం

By Siva KodatiFirst Published Sep 7, 2022, 4:44 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు.  పీఎం గతశక్తి పథకం కోసం రైల్వే భూముల్ని లీజుకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. దేశవ్యాప్తంగా 14 వేల పాఠశాలలను పీఎం శ్రీ పథకం కింద అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా కేంద్రీయ విద్యాలయాలతో పాటు నవోదయా పాఠశాలలు కూడా వున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా వున్న రైల్వే స్థలాలను లీజుకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. 

ఐదేళ్లలో మూడు వందల కార్గో టెర్మినల్స్‌ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రులు వెల్లడించారు. పీఎం గతశక్తి పథకం కోసం రైల్వే భూముల్ని లీజుకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. వీటితో పాటు రైల్వే ల్యాండ్ లైసెన్స్ ఫీజును కూడా ఆరు శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించేందుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ భూముల లీజు సమయాన్ని 35 ఏళ్లకు పెంచాలని.. ఈ పాలసీ ద్వారా 1.2 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. 
 

click me!