పశ్చిమ బెంగాల్ లో హింస.. పంచాయతీ ఎన్నికలు చెల్లవని ప్రకటించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత

By Asianet News  |  First Published Jul 8, 2023, 1:58 PM IST

పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనల్లో 9 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు చెల్లవని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. 


రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెలరేగిన హింస, హత్యల కారణంగా పశ్చిమ బెంగాల్ లో శనివారం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు చెల్లవని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు కౌస్తవ్ బాగ్చీ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం అందించారు.

హింసాత్మకంగా మారిన బెంగాల్ పంచాయతీ ఎన్నికలు.. ఘర్షణల్లో 9 మంది మృతి, బ్యాలెట్ బాక్సులు దగ్ధం

Latest Videos

ఉదయం 7 గంటలకు పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం వరకు ఆరుగురు మృతి చెందారు. అయితే అర్ధరాత్రి నుంచి జరిగిన హింసాకాండలో మరో ముగ్గురు మృతి చెందారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం అత్యవసర విచారణ కోసం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం అందించినట్టు బాగ్చీ మీడియాతో తెలిపారు. 

Breaking: Congress leader & advocate Kaustav Bagchi approaches to declare null & void due to reported violence.

The petition has been filed via email to the Chief Justice a short while ago.

— Sreyashi Dey (@SreyashiDey)

రాష్ట్రంలో గ్రామీణ ఎన్నికలు చెల్లవని ప్రకటించాలని ఆయన అందులో హైకోర్టుకు విజ్ఞప్తి తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడం, హింస, హత్యలను కోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు. 
 

click me!