
Vijay Mallya Case: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి పరారీలో ఉన్న వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు సోమవారం నాడు సుప్రీంకోర్టు శిక్షను ఖరారు చేయనుంది. విదేశీ ఖాతాలకు నగదు బదిలీకి సంబంధించి మాల్యా కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, గత ఐదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. దీంతో 2017లో అతనిపై సుప్రీంకోర్టు ధిక్కారకు పాల్పడినట్టు నిర్ధారించింది.
ఈ కేసు ఎన్నిసార్టు విచారణకు వచ్చిన మాల్యా హాజరుకాలేదు. కనీసం అతని తరపున న్యాయవాదులూ ఎవరూ రాలేదు. ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్‌లు యూయూ లలిత్, రవీంద్ర ఎస్ భట్, పీఎస్ నరసింహల ధర్మాసనం.. తీర్పును గత మార్చి 10న రిజర్వు చేసింది. మాల్యా తన వాదనను వినిపించేందుకు చివరి అవకాశం ఇచ్చింది. మాల్యా తదుపరి విచారణలో హాజరుకాకపోయినా లేదా తన తరఫు న్యాయవాది ద్వారా హాజరుకాకపోయినా, శిక్ష ఖరారు చేయనున్నట్టు కోర్టు పేర్కొంది.
మే 9, 2017న బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి పరారీలో ఉన్న మాల్యాపై సుప్రీంకోర్టు ధిక్కార నేరం మోపింది. డియెగో డీల్‌లోని $40 మిలియన్లను తన పిల్లల విదేశీ ఖాతాలకు బదిలీ చేసినందుకు, ఖచ్చితమైన ఆస్తి వివరాలను అందించడంలో ఆయన విఫలమయ్యాడు. దీంతో అతనిపై కోర్టు ధిక్కార నేరం నమోదైంది. ఆయన రివ్యూ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. శిక్షపై చర్చించేందుకు దోషి హాజరుకావడం చట్టపరంగా అవసరమని స్పష్టం చేసింది. అయితే మాల్యాకు అనేక అవకాశాలు కల్పించినప్పటికీ .. ఆయన ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాలేకపోయారు. ప్రభుత్వం, పోలీసు కూడా మాల్యాను ఇప్పటికీ భారత్‌కు తీసుకురాలేక పోయారు.
అప్పగింత కోసం జరిగిన న్యాయపోరాటంలో ఓడిపోయినప్పటికీ, మాల్యా కొన్ని చట్టపరమైన లొసుగులను అడ్డం పెట్టుకుని యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివాసముంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అతను అక్కడ కొన్ని రహస్య న్యాయ ప్రక్రియను ప్రారంభించాడని తెలిపింది. UK ప్రభుత్వం
మాల్యాను పట్టి ఇవ్వడంలో భారత ప్రభుత్వానికి సహాకరించలేకపోతుంది. దీంతో మాల్యాను ఇంకా భారత్‌కు తీసుకురాలేదు.
విజయ్ మాల్యాకు ఎలాంటి శిక్ష పడవచ్చు?
విచారణ సందర్భంగా కోర్టు ధిక్కార కేసులో గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష అని కూడా కోర్టులో ప్రస్తావించారు. దీనిపై న్యాయమూర్తులు యు యు లలిత్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 (సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారాలు) మరియు 145 (అత్యున్నత న్యాయస్థానం తన చర్యలకు సంబంధించిన నిబంధనలను నిర్ణయించే అధికారం) కింద పేర్కొంది. అటువంటి పరిమితి ఏదీ సెట్ చేయబడదు. ఈ కేసులో తీర్పును మే 5న కోర్టు రిజర్వ్‌లో ఉంచింది.