యువతితో డ్యాన్స్‌లు, ఫ్లయింగ్‌ కిస్‌ లు.. నితీశ్ కుమార్ పార్టీ ఎమ్మెల్యేకు వార్నింగ్..

Published : May 16, 2022, 02:20 PM IST
యువతితో డ్యాన్స్‌లు, ఫ్లయింగ్‌ కిస్‌ లు.. నితీశ్ కుమార్ పార్టీ ఎమ్మెల్యేకు వార్నింగ్..

సారాంశం

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోపాల్ మండల్ మరోవారి వార్తల్లోకి ఎక్కాడు. ఓ వివాహ వేడుకలో యువతితో కలిసి డ్యాన్సులు వేస్తూ, ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ.. వీడియోకు చిక్కాడు. 

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి  Nitish Kumar పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వీడియో ఇప్పుడు Social mediaలో తెగ వైరల్ అవుతోంది. ఆయన తన నియోజకవర్గంలోని ఓ పెళ్లి వేడుకలో ఓ యువతితో కలిసి డ్యాన్స్‌ చేస్తూ Flying Kiss లు ఇస్తూ.. డబ్బులు గాలిలోకి విసురుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా షేర్‌ అయింది. ఇది వివాదాస్పదంగా మారింది. దీంతో ఇబ్బంది పడిన జనతాదళ్ యునైటెడ్ (జెడియు) తన పదవికి తగ్గట్టుగా "ప్రవర్తించండి", "గౌరవాన్ని కాపాడుకోవాలి" అని శాసనసభ్యుడిని కోరినట్లు సమాచారం.

బీహార్ అసెంబ్లీలో భాగల్‌పూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గోపాల్ మండల్ ఈ వీడియోలో ఆ యువతితో డ్యాన్స్ చేస్తూ.. ఆయన కూడా తన కుర్తాను ఎత్తి, ఆ మహిళ చేతులు పట్టుకోవడం కనిపించింది. బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలోని ఫతేపూర్ గ్రామంలో జరిగిన వివాహ రిసెప్షన్‌లో ఈ ఎమ్మెల్యే ఇలా వ్యవహరించినట్లు సమాచారం.

నివేదికల ప్రకారం, మొదట JDU ఎమ్మెల్యే వేదికపై కూర్చున్నాడు. తన ముందు డ్యాన్స్ లు చూస్తూ సడెన్ గా లేచి తాను కూడా మహిళతో కలిసి డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత అతనితో పాటు కూర్చున్న ఇద్దరు వ్యక్తులు కూడా ఈ డ్యాన్స్ లో చేరారు. ఈ చర్యతో గోపాల్ మండల్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అతనికి పార్టీనుంచి మందలింపులు వచ్చాయి. అయితే గోపాల్ మండల్ మాత్రం తనను తాను సమర్థించుకున్నాడు, డ్యాన్స్ పట్ల తన అభిరుచిని వదులుకోలేనని, దానిపేరుతో తన ప్రవర్తనను నిందించడం తగదని సమర్థించుకున్నాడు.

గతంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బహిరంగంగా ఎందుకు డ్యాన్స్ చేస్తారని తనను అడిగారని, సంగీతం విన్నప్పుడల్లా అలా చేయాలనే తపన తనలో కలుగుతుందని తాను సమాధానమిచ్చానని చెప్పారు. ఓ కళాకారుడిని నృత్యం చేయకుండా ఎవరూ ఆపలేరు’ అని ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలిపారు. దీనిమీద JD(U) బీహార్ యూనిట్ ప్రెసిడెంట్, ఉమేష్ కుష్వాహ స్పందిస్తూ.. ‘పదవికి తగ్గట్టుగా ప్రవర్తించండి, కుర్చీ  గౌరవాన్ని కాపాడండి’ అని శాసనసభ్యుడిని కోరారు.

అయితే గోపాల్ మండల్ ఇలా బహిరంగంగా నృత్య ప్రదర్శన చేయడం ఇదే మొదటిసారి కాదు. ఫిబ్రవరిలో, బీహార్ ఎమ్మెల్యే వివాహ రిసెప్షన్‌లో బాలీవుడ్ హిట్ 'దిల్లీవాలి గర్ల్‌ఫ్రెండ్'కి డ్యాన్స్ చేస్తూ వీడియోకి చిక్కాడు. అంతేకాదు మండల్ గత సంవత్సరం రైలు ప్రయాణంలో తన లోదుస్తులతో కంపార్ట్ మెంట్లో తిరుగుతూ వార్తల్లోకి ఎక్కాడు. ఆ సమయంలో ప్రశ్నించినవారికి తనకు కడుపు నొప్పిగా ఉందని.. అందుకే అలా తిరిగానని మంత్రి పేర్కొన్నారు.

ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ "నేను విరేచనాలతో బాధపడుతున్నాను. ప్రయాణం ప్రారంభం కాగానే వాష్‌రూమ్‌కి వెళ్లాలని అనిపించింది. అందుకే నా కుర్తా, పైజామాను విప్పి, టాయిలెట్‌కు వెళ్లాను," అని తన చర్యను సమర్థించుకున్నాడు.

 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?