నడి వీధుల్లో నగ్నంగా తిరిగిన మహిళ... వీడియో వైరల్..!

Published : Feb 03, 2023, 01:04 PM IST
నడి వీధుల్లో నగ్నంగా తిరిగిన మహిళ... వీడియో వైరల్..!

సారాంశం

ఇతర సోషల్ మీడియా వెబ్ సైట్లలో షేర్  చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. అయితే... ఆ మహిళ ఎవరు అనే విషయం తెలియలేదు. ఆమె ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు.


నడి వీధుల్లో ఓ మహిళ నగ్నంగా తిరుగుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారగా... ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ వీధుల్లో చోటుచేసుకుంది. ఆ వీడియోలో మహిళ నగ్నంగా తిరుగుతూ కనిపించింది. సీసీ కెమేరాలో వీడియో రికార్డు అయ్యింది.  దీనిని వాట్సాప్ లో, ఇతర సోషల్ మీడియా వెబ్ సైట్లలో షేర్  చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. అయితే... ఆ మహిళ ఎవరు అనే విషయం తెలియలేదు. ఆమె ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు.

తెలిసిన సమాచారం మేరకు... జనవరి 29 రాత్రి నగ్నంగా ఉన్న మహిళ నడి వీధులో తిరుగుతూ... కొందరి ఇళ్లు తలుపు కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అదంతా సమీపంలోని సీసీ కెమేరాలో రికార్డు కావడం గమనార్హం. 

 

జనవరి 31వ తేదీన, రాంపూర్ పోలీసులకు  స్థానికులు ఫిర్యాదు చేశారు. అయితే... పోలీసులు ఇంకా మహిళ ఎవరు అనేది,  ఆమె ఆచూకీ కనుగొనలేదు.  మహిళ వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు. వీడియో ప్రకారం.... మహిళ వెంట ఎవరో బైకర్లు వెంబడించినట్లు తెలుస్తోంది. 

దీనిపై విచారణ జరుపుతున్నట్లు రాంపూర్ పోలీసులు తెలిపారు. మహిళ ఉద్దేశ్యం స్పష్టంగా తెలియలేదని, మరిన్ని వివరాలను సేకరించేందుకు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు గతంలో తెలిపారు. పోలీసులు కూడా ఆ ప్రాంతంలో గస్తీని పెంచారు. మహిళ ఎక్కడైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు.
 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !