
కర్ణాటక రాజధాని బెంగళూరు నీట మునిగింది. గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు వీధులు జలమయమయ్యాయి. వందలాది వీధుల్లో భారీగా నీరు చేసింది. దీంతో ఐటీ రాజధానిలోని పలు ప్రాంతాలు సముద్రాన్ని తలాపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రవాణా వ్యవస్థ స్థంభించింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు తల్లెత్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలుపడుతున్నారు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే.. మహీంద్రా & మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. బెంగళూర్ లో కురుస్తున్న భారీ వర్షాలపై స్పందించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారీగా కురుస్తున్న వర్షాలకు రహదారులు నీటమునిగాయి. ఈ సమయంలో కొందరూ రహదారికి అడ్డంగా ప్రవహిస్తున్నప్రవాహాన్ని దాటడానికి బుల్‌డోజర్‌లను ఉపయోగిస్తున్నారు.
ఇందులో ఇద్దరు డ్రైవర్ వద్ద నిల్చుని ఉండగా, మరికొందరూ.. బుల్ డోజర్ బకెట్ లో నిల్చున్నారు. ఇందులో ఉన్న వ్యక్తులు చాలా నిట్ గా డ్రెస్ ఆఫ్ అయి.. చేతిలో బ్యాగ్ పట్టుకొని ఐటీ ఆఫీసులకు వెళ్తున్నట్టుగా కనిపించారు. ఈ వీడియోను గోవింద్‌కుమార్ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ఈ వీడియోను చూసిన ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ.. తనదైన శైలిలో స్పందించారు. ఎక్కడ సంకల్పం ఉంటే.. అక్కడ మార్గం ఉంటుంది అని కామెంట్ చేశారు. ఈ వీడియోని చూసిన యూజర్లు కూడా కామెంట్ చేస్తూ షేర్ చేశారు.
కొంతమంది నెటిజన్లు.. అవసరం ఆవిష్కరణకు తల్లి లాంటిదని కామెంట్ చేశారు. అదే సమయంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. విచక్షణారహితమైన అభివృద్ధి ఫలితంగా ఈ విధ్వంసం జరిగిందని విమర్శలు గుప్పిస్తు్న్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు 5 లక్షలకు వ్యూస్.. 9 వేలకు పైగా లైక్‌లు, 1.2 వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. దీనిపై ట్విట్టర్ యూజర్లు కూడా తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు.