మామపై పదే పదే దాడికి దిగిన మహిళా పోలీసు.. వీడియో వైరల్ కావడంతో..

Published : Sep 06, 2022, 05:32 PM IST
మామపై పదే పదే దాడికి దిగిన మహిళా పోలీసు.. వీడియో వైరల్ కావడంతో..

సారాంశం

ఒక మహిళా పోలీసు తన మామపై చేయి చేసుకుంది. మరోక పోలీసు సమక్షంలోనే తన మామపై దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

ఒక మహిళా పోలీసు తన మామపై చేయి చేసుకుంది. మరోక పోలీసు సమక్షంలోనే తన మామపై దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతరం ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆదివారం (సెప్టెంబర్ 4) రోజున ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం.. దాడి చేసిన మహిళ పోలీసు ప్రస్తుతం డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆమెకు తన మామకు మధ్య కోర్టు కేసు ఉందని.. అందుకు సంబంధించి ఇద్దరి మధ్య వాదన జరిగినట్టుగా తెలుస్తోంది. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఆ మహిళా పోలీసుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అలాగే ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. 

 


ఆ వీడియో ప్రకారం మహిళా పోలీసు తల్లి  తొలుత అక్కడ వాదనకు దిగినట్టుగా తెలుస్తోంది. అనంతరం ఇద్దరు కలిసి వృద్దుడైన మహిళా పోలీసు మామపై దాడికి దిగారు. అయితే ఆ సమయంలో మరో పోలీసు అక్కడే ఉన్నాడు. ఇక, మహిళ పోలీసు, ఆమె తల్లి దాడి చేస్తున్న దృశ్యాలకు మరో మహిళ చిత్రీకరిస్తుండగా.. వారు ఆమెతో వాగ్వాదానికి దిగారు. 
 

PREV
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu