బ్లక్ ఫంగస్... చికిత్సకు రూ.కోటిన్నర ఖర్చు చేసినా...

By telugu news teamFirst Published Jun 12, 2021, 7:37 AM IST
Highlights

తొలుత చికిత్స కోసం నాగ్ పూర్, హైదరాబాద్ లోని వైద్యుల్ని సంప్రదించాడు. అతని సమస్యను వైద్యులు గుర్తించలేకపోయారు.
 

దేశంలో కరోనా మహమ్మారితోపాటు.. బ్లాక్ ఫంగస్ తో కూడా తీవ్ర రూపం దాలుస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిని ఈ బ్లాక్ ఫంగస్ వేధిస్తోంది. తాజాగా ఓ వ్యక్తికి కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ బ్లాక్ ఫంగస్ సోకింది. చికిత్స కోసం అతను దాదాపు రూ.కోటిన్నర ఖర్చు చేశాడు. అయినా.. అతని ఒక కన్ను పోయింది.ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నాగ్ పూర్ లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ పాల్ గత ఏడాది కరోనా నుంచి కోలుకున్నాడు. ఆ తర్వాత సెప్టెంబర్ లో బ్లాక్ ఫంగస్ సోకింది. తొలుత చికిత్స కోసం నాగ్ పూర్, హైదరాబాద్ లోని వైద్యుల్ని సంప్రదించాడు. అతని సమస్యను వైద్యులు గుర్తించలేకపోయారు.

దీంతో నవంబమర్ లో ముంబయిలోని హిందూజా ఆస్పత్రిలో చేరగా బ్లాక్ ఫంగస్ సోకినట్లు గుర్తదించి చికిత్స ప్రారంభించారు. అక్కడ అతనికి మూడు శస్త్ర చికిత్సలు చేశారు. మందులు, ఇంజెక్షన్ల ఖర్చులు రోజు రోజుకీ పెరిగిపోవడంతో డిసెంబర్ నుంచి నాగ్ పూర్ లోనే ఉంటూ చికిత్స తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. 

అతని భార్య రైల్వే ఉద్యోగి కావడంతో స్థానిక రైల్వే ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు పాల్ ఎడమ కన్ను సహా ఇన్ఫెక్షన్ కి గురైన నోటిలో కొంత భాగాన్ని తొలగించారు. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.

click me!