పుదుచ్చేరిలో దారుణం: స్కూల్ టాపర్‌గా నిలిచిన విద్యార్ధిని చంపిన తల్లి

By narsimha lodeFirst Published Sep 4, 2022, 9:50 AM IST
Highlights


తన కొడుకు కంటేమరో విద్యార్ధికి ఎక్కువ మార్కులు రావడంతో తట్టుకోలేదు ఓ మహిళ. స్కూల్ టాపర్ నిలిచిన మణికందన్ అనే విద్యార్ధికి విషం ఇవ్వడంతో ఆ విద్యార్ధి మరణించాడు. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. 

పాండిచ్చేరి: పుదుచ్చేరిలోని  కారైక్కాల్ లో  దారుణం చోటు చేసుకుంది. తన కొడుకు కంటే  మణికందన్  అనే విద్యార్ధికి ఎక్కువ మార్కులు వస్తున్నాయని విషం ఇవ్వడంతో అతను మరణించాడు.  ఈ ఘటనకు పాల్పడిన  విక్టోరియా అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. 

పుదుచ్చేరిలోని కారైక్కాల్ లోని  రాజేంద్రన్ దంపతుల కొడుకు మనికందన్ . కారైక్కాలోని ప్రైవేట్ స్కూల్ లో మణికందర్ 8వ తరగతి చదువుతున్నాడు. మణికందన్ స్కూల్ ఫస్ట్ వచ్చాడు. దీంతో రెండు రోజుల క్రితం స్కూల్ యాజమాన్యం మణికందన్ ను అభినందించింది. అతనికి ఫ్రైజ్ ను కూడ అందించింది. అయితే ఇదే స్కూల్ లో విక్టోరియా అనే మహిళ కొడుకు కూడా చదువుతున్నాడు. గతంలో ఈ స్కూల్ టాపర్ గా ఆ విద్యార్ధి ఉండేవాడు. అయితే ఈ దఫా మణికందన్ స్కూల్ టాపర్ గా నిలిచాడు. ఇది తట్టుకోలేని విక్టోరియా మణికందన్ ను చంపాలని భావించింది. వెంటనే స్కూల్ అటెండర్ ను పిలిచి కూల్ డ్రింక్ తెప్పించింది. ఆ కూల్ డ్రింక్ లో విషం కలిపి మణికందన్ కు ఇచ్చింది.  ఈ కూల్ డ్రింక్ తాగిన కొద్దిసేపటి  తర్వాత మణికందన్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్కూల్ యాజమాన్యం మణికందన్ ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణికందన్ మరణించాడు. మణికందన్ పై విష ప్రయోగం జరగిందని వైద్యులు చెప్పడంతో ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేశారు.

 స్కూల్ సీసీటీవీ పుటేజీని పరిశీలించిన పోలీసులకు  విక్టోరియా అనే మహిళ అనుమానాస్పద కదలికలను గుర్తించారు. దీంతో స్కూల్ అటెండర్ ను విక్టోరియా అనే మహిళను ప్రశ్నించారు. పోలీసుల విచారణలో మణికందన్ కు ఇచ్చిన కూల్ డ్రింక్ లో విషం కలిపిన విషయం వెలుగు చూసింది.  విక్టోరియాను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ ఘటనపై మణికందన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్య్యాప్తు చేస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 
 

click me!