దీక్ష చ‌దువు బాధ్య‌త‌లు తీసుకుంటా.. కాశ్మీరీ పండిట్ సంజ‌య్ శ‌ర్మ కుటుంబానికి అండ‌గా అనుపమ్ ఖేర్..

Published : Mar 01, 2023, 02:48 PM IST
దీక్ష చ‌దువు బాధ్య‌త‌లు తీసుకుంటా.. కాశ్మీరీ పండిట్ సంజ‌య్ శ‌ర్మ కుటుంబానికి అండ‌గా అనుపమ్ ఖేర్..

సారాంశం

New Delhi: కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫోర్స్ (టీఆర్ ఎఫ్ )కు చెందిన ఉగ్రవాది చేతిలో హత్యకు గురైన దక్షిణ కాశ్మీర్ లోని అచెన్ గ్రామానికి చెందిన కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ ఏడేళ్ల కుమార్తె దీక్షను చదివించే బాధ్యతను తాను తీసుకుంటానని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రకటించారు.  

Anupam Kher offers to sponsor education of Diksha: జ‌మ్మూకాశ్మీర్ లో ఇటీవ‌లి కాలంలో ఉగ్ర‌వాద చ‌ర్య‌లు మ‌ళ్లీ పెరుగుతున్న ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ముఖ్యంగా కాశ్మీర్ పండిట్ల‌ను టార్గెట్ చేస్తూ దాడులు జ‌రుగుతుండ‌టంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే  గ‌త ఆదివారం ఒక సంజ‌య్ శ‌ర్మ అనే కాశ్మీరీ పండిట్ ను ఉగ్ర‌వాదులు కాల్చిచంపారు. కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫోర్స్ (టీఆర్ ఎఫ్ )కు చెందిన ఉగ్రవాది చేతిలో హత్యకు గురైన దక్షిణ కాశ్మీర్ లోని అచెన్ గ్రామానికి చెందిన సంజయ్ శర్మ ఏడేళ్ల కుమార్తె దీక్షను చదివించే బాధ్యతను తాను తీసుకుంటానని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రకటించారు.

సంజ‌య్ శ‌ర్మ‌ మృతదేహం తమ ఇంటి ఆవరణలో ఉండ‌గా, పెద్ద సంఖ్యలో ముస్లిం, ఇత‌రులు ఉండగా ఆయ‌న కుమార్తె దీక్ష ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పండిట్ కుటుంబానికి అండ‌గా ఉంటామంటూ చాలా మంది సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. ఈ క్రమంలోనే దీక్ష చ‌దువు బాధ్య‌త‌లు తాను తీసుకుంటాన‌ని ప్ర‌ముఖ న‌టుడు అనుపమ్ ఖేర్ ప్రకటన చేశారు. ఆ చిన్నారికి చదువు చెప్పే పూర్తి బాధ్యతను తాను తీసుకుంటానని ఖేర్ గ్లోబల్ కాశ్మీరీ పండిట్ డయాస్పోరా ఆర్గనైజేషన్ కు లేఖ రాశారు. "బాలిక ఎంత వ‌ర‌కు చ‌దువుకుంటానంటే అంత‌వ‌ర‌కు చ‌ద‌వ‌ని.. ఆమె చ‌దువుల బాధ్య‌త‌లు నేను తీసుకుంటాను" అని సంస్థకు పంపిన వాయిస్ మెసేజ్ లో ఆయన పేర్కొన్నారు.

 

 

కాగా, బ్యాంక్ ఏటీఎం గార్డు సంజయ్ శర్మ (45) ఆదివారం ఉదయం తన భార్యతో కలిసి గ్రామ మార్కెట్ నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. మూడు దశాబ్దాల క్రితం చెలరేగిన హింస, ఉగ్రవాదం నేపథ్యంలో హిందువులు లోయను విడిచిపెట్టినప్పుడు లోయలో నివసిస్తున్న కొద్దిమంది కాశ్మీరీ పండిట్లలో ఆయన కుటుంబం కూడా ఒక‌టి. సంజయ్ శర్మకు భార్య,  కుమార్తె దీక్ష‌తో పాటు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయ‌న హ‌త్య‌ను జ‌మ్మూ ముస్లింలు తీవ్రంగా ఖండించారు. ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు త‌మ మ‌ద్ద‌తు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. 

దీక్షా ఫోటో సోషల్ మీడియాలో చాలా మంది హృద‌యాల‌ను కదిలించింది. దీక్ష ఫొటో వైర‌ల్ కావ‌డంతో బాధిత కుటుంబానికి మద్దతుగా కామెంట్లు నిండిపోయాయి. గ్లోబల్ కాశ్మీరీ పండిట్ డయాస్పోరా నాయకుడు సురీందర్ కౌల్ మాట్లాడుతూ, ఆ కుటుంబాన్ని సంప్రదించి ఖేర్ కుటుంబానికి తన సహాయాన్ని అందించడానికి ఒక ఏర్పాటు చేస్తానని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu
PM Modi Visit Oman: ఒమన్ లో మోదీకి ఘనస్వాగతంభారత ప్రజలు | Asianet News Telugu