ఆలయంలోకి దూరిన మొసలి.. పూజారి వేడుకోవడంతో...

By telugu news teamFirst Published Oct 22, 2020, 2:30 PM IST
Highlights

గుడిలో ఇచ్చే ప్రసాదం తప్ప మరే ఆహారాన్ని అది ముట్టదు. గతంలో ఆ మొసలి ఆలయం లోపలికి ఎప్పుడూ రాలేదని, ఇదే తొలిసారని ఆలయ ప్రధాన పూజారి చంద్ర ప్రకాష్ నంబీసన్ చెప్పారు. 

ఇటీవల దేశవ్యాప్తంగా భారీ వర్షాలు నమోదైన సంగతి తెలిసిందే.  కాగా.. ఈ వర్షాలకు చాలా ప్రాంతాలో మునిగిపోయాయి. ఈ క్రమంలో ఓ లోతట్టు ప్రాంతంలోని ఆలయంలోకి మొసలి దూరింది. కాగా.. దానిని కూడా దేవుడిగా భావించిన ఆలయ పూజారి.. దానిని వేడుకోగా.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కసరగడ్ జిల్లాలోని అనంతపుర ఆలయం సమీపంలో ఉన్న సరస్సులో ఒక శాఖాహార మొసలి ఉంది. దానిని బలియా అని పిలుస్తారు. చాలాకాలంగా అది ఆ ఆలయానికి పహారా కాస్తోంది. గుడిలో ఇచ్చే ప్రసాదం తప్ప మరే ఆహారాన్ని అది ముట్టదు. గతంలో ఆ మొసలి ఆలయం లోపలికి ఎప్పుడూ రాలేదని, ఇదే తొలిసారని ఆలయ ప్రధాన పూజారి చంద్ర ప్రకాష్ నంబీసన్ చెప్పారు. 

ఈ మొసలి గర్భగుడిలోకి ప్రవేశించిందని కొందరు చేసే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. కాగా ఈ మొసలి ఆలయానికి పహారా కాయడం వెనుక స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. 70 ఏళ్ల కిందట ఓ బ్రిటీష్ సైనికుడు ఈ సరస్సులో ఉన్న మొసలిని చంపేశాడట. తరువాత ఆ సైనికుడు పాము కాటుకు గురై చనిపోయాడట. ఆ దైవమే అతన్ని చంపిందని స్థానికులు అంటుంటారు. అయితే ఆ మొసలి మృతి చెందిన కొద్ది రోజులకే మరో మొసలి ఆ సరస్సులోకి వచ్చి చేరింది. ఇప్పుడది ఆలయానికి కాపలా కాస్తోంది. 

click me!