
ఈ ఏడాది దేశంలోకి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. అయితే, ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా వానలు పడటం లేదు. ఆయా పరిస్థితుల ప్రభావం ఈ సీజన్ సాగుపై కనిపిస్తోంది. ఇప్పటికే ఉన్న పంటలపై ప్రభావం పడటంతో కూరగాయల ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగిపోయాయి ఫలితంగా ఒక కేజీ టమాటా ధర సుమారు రూ. 150 నుంచి రూ. 200 సమీపంలో పలుకుతోంది. దీంతో సామాన్యుల వంటకాలు నుంచి టమాట మాయమైపోయింది. హోటళ్లు, రెస్టారెంట్లు సైతం టమోటాలతో చేసే వంటకాలను తగ్గించేశాయి.
ఇదిలావుంటే దేశవ్యాప్తంగా టమోటా దొంగలు పెరిగిపోతున్నారు. పంట చేనులు, గిడ్డంగులు, దుకాణాల వద్ద టమోటాలను దొంగతనం చేస్తున్నారు. మంచి ధర వున్న పరిస్థితుల్లో లాభపడదామని అనుకుంటుంటే అన్నదాతలను దొంగలు నిండా ముంచుతున్నారు. ఈ రకరకాల వింతలు ప్రతిరోజూ వార్తల్లో వింటూనే వున్నాం. ఈ నేపథ్యంలో దొంగల బారి నుంచి టమోటాలను కాపాడుకునేందుకు గాను ఓ వ్యాపారి ఏకంగా బౌన్సర్లను నియమించుకున్నాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో చోటు చేసుకుంది.
ALso Read: గుడ్ న్యూస్...భారీగా పడిపోయిన టమాటా ధర..తాజా ధర ఎంతో తెలిస్తే పండగ చేసుకుంటారు..
దీనిపై వ్యాపారి అజయ్ ఫౌజి మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా టమోటా ధరలు పెరుగుతున్నాయని, దీంతో టమోటాలు కొనేందుకు వచ్చినవారితో గొడవ పడాల్సి వస్తోందన్నారు. ఇంకొందరైతే టమోటాలను ఎత్తుకెళ్లిపోయారని అజయ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే కస్టమర్లతో గొడవ పడలేక బౌన్సర్లను నియమించుకున్నట్లు ఆయన తెలిపారు. ఫౌజి కూరగాయాల దుకాణం వద్ద బౌన్సర్లు కాపలా కాస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే, ఈ వార్తల్లో నిజం లేదని.. పొరపాటు పడ్డామని పీటీఐ ట్వీట్ చేసింది. వార్తలోని నిజానిజాలు తెలుసుకోవడంతో వైఫల్యం చెందామని క్షమించాలని కోరింది. ఆ ట్వీట్ ఇదే...