జ్ఞానవాపి మసీదు వివాదం: ముస్లింల పిటిషన్ పై విచారణ 26కి వాయిదా

Published : May 24, 2022, 03:38 PM ISTUpdated : May 24, 2022, 04:03 PM IST
జ్ఞానవాపి మసీదు వివాదం: ముస్లింల పిటిషన్ పై విచారణ 26కి వాయిదా

సారాంశం

జ్ఞానవాపి మసీదు వివాదంపై  ముస్లింలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది వారణాసి జిల్లా కోర్టు.

న్యూఢిల్లీ: Gyanvapi మసీదు వివాదంపై  Muslims దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది Varanasi Court జ్ఞానవాపి మసీదులో Survey రిపోర్టుపై తమ అభ్యంతరాలను  సమర్పించేందుకు ఇరు వర్గాలకు కోర్టు వారం రోజుల సమయం ఇచ్చింది. వారణాసి జిల్లా కోర్టు జడ్జి ఏకే విశ్వేష్ Hindu, ముస్లిం పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

also read:ధ్వంసమైన ఆలయాల గురించి మాట్లాడటం దండగ: సద్గురు సంచలన అభిప్రాయాలు

వీడియోగ్రఫీ సర్వేలో మసీదు ఆవరణలో శివ లింగం ఉన్న ప్రాంతంలో పూజలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కూడా పిటిషన్ దాఖలైంది. జ్ఞాన్‌వాపి-శృంగర్ గౌరీ దేవాలయం కేసును సివిల్ జడ్జి నుండి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ ఈ నెల 20న సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే.

25-30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్ జ్యుడిషీయల్ అధికారి ఈ కేసును పరిశీలిస్తే మంచిదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడిన విషయం తెలిసిందే. కోర్టు నియమించిన కమిషన్ తన పనిని పూర్తి చేసినందున ప్రత్యర్థులు తమ అభ్యంతరాలను తెలపాలని హిందూ పక్షం వాదించింది.

జ్ఞానవాపి మసీదులో  సర్వే రిపోర్టును  ను వారణాసి కోర్టుకు  కమిషన్ ఈ నెల 19న  కోర్టుకు  సమర్పించింది. విశాల్ సింగ్ నేతృత్వంలోని సర్వే  బృందం ఈ రిపోర్టును కోర్టుకు అందించింది.  సీల్డ్ కవర్లో రిపోర్టును కోర్టుకు అందించారు విశాల్ సింగ్. 

  కాశీ విశ్వనాథ ఆలయం- జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని సర్వే చేయాలని కోర్టు  ఇదివరకే కమిషన్ ను నియమించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఈ సర్వే రిపోర్టులో కొన్ని కీలక అంశాలను మీడియాకు లీక్ చేయడంతో సర్వే కమిటీ నుండి అజయ్ మిశ్రాను తొలగించారు. రెండు రోజుల్లో నివేదికను ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రెండు రోజులు ఇవాళ్టికి పూర్తి కానుంది. ఇవాళ ఉదయం కోర్టు ప్రారంభం కాగానే కమిషన్ సభ్యులు సర్వే రిపోర్టును అందించారు.

ఈ సర్వే రిపోర్టును  రవికుమార్ దివాకర్ కోర్టులో సమర్పించారు.  జ్ఞానవాపి మసీదు వ్యవహరంలో విచారణను ఈ నెల 20వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. గురువారం నాడు ఫిర్యాదుదారులు మరింత సమయం కోరడంతో  ఇవాళ విచారణను నిర్వహించవద్దని కూడా వారణాసి కోర్టుకు సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది.

విశాల్ సింగ్ నేతృత్వంలోని  ప్రత్యేక కమిషనర్ మూడు పెట్టెలను వారణాసి కోర్టుకు సమర్పించారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో నిర్వహించిన వీడియో రికార్డులను  ఈ పెట్టెల్లో భద్రపర్చారు.

జ్ఞానవాపి కాంప్లెక్స్ లో గల బావిలో శివలింగం బయటపడిన ప్రాంతాన్ని సంరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని  సుప్రీంకోర్టు ఈ నెల 17న  ఆదేశించింది.   ఈ కేసులో ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.  వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పులో రెండు అంశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

డివై చంద్రచూడ్, నర్సింహలతో కూడిన ధర్మాసనం మరో వైపు  నమాజ్ చేసుకొనేందుకు కూడా ముస్లింలకు అనుమతిని ఇచ్చింది.  వారణాసి మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పుల్లో కొన్నింటికి సవరణలు ఇచ్చింది.  రెండింటిపై స్టే కూడా విధించింది. 

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?