కేరళలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల‌దాడి.. వారం వ్య‌వ‌ధిలో రెండో ఘ‌ట‌న

Published : May 09, 2023, 05:59 AM IST
కేరళలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల‌దాడి.. వారం వ్య‌వ‌ధిలో రెండో ఘ‌ట‌న

సారాంశం

Vande Bharat Express: కేరళలోని వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జ‌రిగింది. వారం వ్యవధిలో రెండో ఘటన కావ‌డంతో సంబంధిత అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. గతవారం, మలప్పురం జిల్లాలోని తిరునావయ-తిరూర్ మధ్య ప్రాంతంలో రైలు ప్రయాణిస్తున్నప్పుడు గుర్తు తెలియని దుండగులు రైలుపై రాళ్లతో దాడి చేశారు.  

Kerala-Vande Bharat Express: కేరళలోని వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జ‌రిగింది. వారం వ్యవధిలో రెండో ఘటన కావ‌డంతో సంబంధిత అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. గతవారం, మలప్పురం జిల్లాలోని తిరునావయ-తిరూర్ మధ్య ప్రాంతంలో రైలు ప్రయాణిస్తున్నప్పుడు గుర్తు తెలియని దుండగులు రైలుపై రాళ్లతో దాడి చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఇటీవల ప్రారంభించిన తిరువనంతపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై సోమవారం రాళ్లు రువ్వారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 3.27 గంటలకు వలపట్టణం- కన్నూర్ చిరక్కల్ మధ్య రైలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రైలు కాసరగోడ్ నుంచి తిరువనంతపురం వెళ్తోంది. రైలు ఉత్తర కేరళలోని జిల్లాలోని వలపట్టణం ప్రాంతం గుండా వెళ్తుండగా దాని కిటికీ అద్దాలపై రాళ్లు రువ్వడం వల్ల స్క్రాచ్ అయినట్లు రైల్వే అధికారులు గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.

వలపట్టణం మీదుగా వెళ్తున్న రైలుపై రాళ్లు రువ్వినట్లు అనుమానించిన రైల్వే అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన సరిగ్గా దాని వలపట్టణం పరిధిలో జరిగిందని నిర్ధారించనప్పటికీ, దర్యాప్తు ప్రారంభించామనీ, ఇటువంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో కూడా.. 

దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఇప్ప‌టికే ప‌లు వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ రైళ్ల‌పై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే మ‌రో వందే భార‌త్ రైలు పై రాళ్ల దాడి జ‌రిగింది. కేర‌ళ‌లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. మలప్పురం జిల్లాలోని తిరునావయ, తిరూర్ మీదుగా వెళ్తుండగా రాళ్ల‌దాడి జ‌రిగింది. సీ4 బోగీలోని 62, 63 సీట్ల కిటికీలపై దుండగులు రాళ్లు రువ్వారు. మలప్పురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. రైల్వే పోలీసులు కూడా కేసు నమోదు చేసిన‌ట్టు పీటీఐ నివేదిక‌లు పేర్కొన్నాయి. 

కేరళలోని తొలి వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 25న తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. మలప్పురం జిల్లాలోని తిరూర్ స్టేషన్ వద్ద ఆగాలని కోరుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ నిరసనలు చేపట్టింది. వందే భారత్ రైలును ప్రకటించిన వెంటనే మొదటి రిపోర్టుల్లో తిరూర్ కూడా స్టాప్ ల జాబితాలో ఉంది. అయితే, తరువాత, షోర్నూర్ చేర్చబడినప్పుడు దానిని తొల‌గించారు.

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?