ఇది బిగ్ బాస్ షో కాదు.. ఓట్లు వేయడానికి.. కమల్ కి పంచ్

By telugu news teamFirst Published Jan 23, 2021, 11:02 AM IST
Highlights

అందరూ ఓట్లేసేందుకు కమల్‌హాసన్‌ అసెంబ్లీ ఎన్నికలను బిస్‌బాస్‌ రియాల్టీ షోగా భావిస్తున్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వైగై సెల్వన్‌ ఎద్దేవా చేశారు. 

విలక్షణ నటుడు కమల్ హాసన్ తమిళనాడు ఎన్నికల్లో తన విశ్వరూపం చూపించాలని అనుకుంటున్నారు. కాగా.. ఆయనను ఎదుర్కొనేందుకు ఇతర పార్టీల నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. తాజాగా.. కమల్ హాసన్ కి అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వైగె సెల్వన్ పంచ్ వేశారు.

అందరూ ఓట్లేసేందుకు కమల్‌హాసన్‌ అసెంబ్లీ ఎన్నికలను బిస్‌బాస్‌ రియాల్టీ షోగా భావిస్తున్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వైగై సెల్వన్‌ ఎద్దేవా చేశారు. కోవిల్‌పట్టిలో శుక్రవారం నిర్వహించిన ఎంజీఆర్‌ 104వ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్టీ నుంచి వైదొలిగిన నేతలు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోక అమోమయంలో ఉన్నారన్నారు. పాఠశాల అద్దె కూడా చెల్లించని ఓ వ్యక్తి (రజనీకాంత్‌) ప్రస్తుతం పార్టీ వద్దు అని పేర్కొన్నారన్నారు.

అలాగే, ఆర్‌కే నగర్‌లో ఓటుకు రూ.5 వేలు ఇస్తామని చెప్పి  గెలిచిన అనంతరం ప్రజలను మర్చిపోయిన వ్యక్తి టీటీవీ దినకరన్‌ అన్నారు. నటన ద్వారా ప్రజలను మెప్పించవచ్చని, అందరూ ఓట్లు వేయడానికి అసెంబ్లీ ఎన్నికలను కూడా బిగ్‌ బాస్‌ రియాల్టీ షో ఓట్లుగా కమల్‌హాసన్‌ భావిస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ఆ షోలో శివాని, రమ్యపాండియన్‌కు వచ్చిన ఓట్లు కూడా కమల్‌హాసన్‌ వచ్చే అవకాశం లేదన్నారు. ఎంకే స్టాలిన్‌ను కరోనా వైరస్‌గా, ఉదయనిధి స్టాలిన్‌ను కరోనా స్ట్రెయిన్‌గా వైగై సెల్వన్‌ అభివర్ణించారు.

click me!