కాంగ్రెస్ టికెట్ కావాలా... ఈ అర్హతలు మీకుంటే త్వరపడండి

By sivanagaprasad KodatiFirst Published 3, Sep 2018, 3:26 PM IST
Highlights

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలా..? అయితే మీకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయా..? మీకు టికెట్ కన్ఫర్మ్. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారిలో సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్లు వున్నవారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలా..? అయితే మీకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయా..? మీకు టికెట్ కన్ఫర్మ్. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారిలో సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్లు వున్నవారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.

ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఖాతాలు ఉండటమే కాకుండా.. సోషల్ మీడియాలో చురుకుగా వుండాలని.. ఫేస్‌బుక్‌లో కనీసం 15, 000 లైకులు, ట్విట్టర్‌లో 5000 మంది ఫాలోవర్లను కలిగి ఉండాలని... అలాగే పెద్దసంఖ్యలో వాట్సాప్ గ్రూపుల్లో ఉండాలని పేర్కొంది.

వారంతా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పోస్టులను రీట్వీట్ చేయాలని, లైక్ కొట్టాలని కోరింది. పార్టీ అధికారిక పేజీల్లో పోస్టులను తమ పేజీల్లో షేర్ చేయాలని సూచించింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్న వారంతా ఈ నెల 15లోగా వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలను పార్టీకి సమర్పించాలని ఒక ప్రకటనలో పేర్కొంది. మరి మీలో ఈ క్వాలిటీస్ ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.
 

Last Updated 9, Sep 2018, 11:19 AM IST