uttarakhand election result 2022: ఉత్తరాఖండ్ లో బీజేపీ-కాంగ్రెస్ హోరాహోరీ.. !

Published : Mar 10, 2022, 09:48 AM IST
uttarakhand election result 2022: ఉత్తరాఖండ్ లో బీజేపీ-కాంగ్రెస్ హోరాహోరీ.. !

సారాంశం

uttarakhand election result 2022: ఉత్త‌రాఖండ్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల కౌంటింగ్ కొన‌సాగుతోంది. రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్‌-బీజేపీల మధ్య నువ్వా-నేనా అనే విధంగా హోరాహోరీ కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు కొన‌సాగిన ఎన్నిక‌ల కౌంటింగ్ వివ‌రాల ప్ర‌కారం.. చెరో 30 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతున్నాయి.  

uttarakhand election result 2022: ఉత్తరాఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు త‌మ‌దే విజ‌యం అంటూ ధీమా వ్య‌క్తం చేశారు. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు కొన‌సాగిన అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ వివ‌రాల గమ‌నిస్తే.. రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్-బీజేపీలు అధికారం ద‌క్కించుకోవ‌డానికి హోరాహోరీగా ముందుకు క‌దులుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు రెండు పార్టీలు 30 స్థానాల‌కు పైగా ఆధిక్యం సాధించాయి. బీజేపీ 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉండ‌గా, కాంగ్రెస్ 31 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 1 స్థానంలో, ఇత‌ర‌లు ఒక స్థానంలో ముంద‌జ‌లో ఉన్నారు. 

ఎగ్జిట్ ఫోల్స్ చాలా వ‌ర‌కు రాష్ట్రంలో బీజేపీ అధికారం చేప‌డుతుంద‌ని పేర్కొన్నాయి. ఈ అవ‌కాశాలు అధికంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఉత్త‌రాఖండ్ లో హంగ్ ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని పేర్కొన్నాయి. ఉత్తరాఖండ్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇది ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్రులు మరియు AAP, SP, BSP మరియు UKD వంటి  పార్టీలు కీల‌క పాత్ర పోషించే అవకాశాన్ని పెంచుతుంది. 60 స్థానాలకు గాను 40 నుంచి 45 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు నేరుగా పోటీ పడుతుండగా, ప్రాంతీయ పార్టీలు 25-30 స్థానాల్లో త్రిముఖ పోరు సాగించాయి. అధికార బీజేపీ కూడా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసింది.

ఇదిలావుండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు అందిన వివ‌రాల ప్రకారం.. ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి వెనుకంజ‌లో ఉన్నారు. కాగా, ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దాని కంటే పార్టీ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు."చాలా ఎగ్జిట్ పోల్స్ ఉత్తరాఖండ్‌లో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని చూపించాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దానికంటే మా వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉంటుంది మరియు ఆ పార్టీ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.. చేసిన పనికి ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌వుతుంది’’ అని అన్నారు. 

అలాగే, కాంగ్రెస్ సైతం గెలుపుపై ధీమాగా ఉంది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. 70 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ దాదాపు 48 సీట్లు గెలుచుకోవచ్చని అన్నారు. "ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయంపై నాకు నమ్మకం ఉంది. వచ్చే 2-3 గంటల్లో అంతా తేలిపోతుంది. రాష్ట్ర ప్రజలపై నాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ 48 స్థానాలకు చేరువవుతుందని నేను నమ్ముతున్నాను" అని రావత్ అన్నారు.

కాగా, రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి  కార్యక్రమాలు, రైల్వే, రహదారుల నిర్మాణం, కేదార్‌నాథ్ ఆలయ పునర్నిర్మాణం వంటి వాటిని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ముఖ్యమంత్రుల మార్పు వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని కాంగ్రెస్ విమర్శలు చేసింది. అటు ఆప్ విషయానికి వస్తే.. 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 18 ఏళ్లు పైబడిన మహిళకు నెలకు రూ.1000 ఆర్ధిక సాయం, కుటుంబానికో ఉద్యోగం, రూ.5 వేల నిరుద్యోగ  భృతి వంటి ప్రజాకర్షక హామీలను ప్రకటించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu