
Yogi Adityanath-Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం తనక్‌పూర్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ ఉప ఎన్నిక ముఖ్యమంత్రికి మరియు అధికార బీజేపీకి కీలకంగా మారింది. ముఖ్యమంత్రిగా మార్చిలో సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సుష్కర్ సింగ్ ధామి.. బలమైన ఎన్నికల విజయం నేపథ్యంలో, అతను అసెంబ్లీ సీటును గెలుచుకోలేకపోయాడు. దీనర్థం, ఉప ఎన్నికలో గెలవడానికి ఆయనకు ఆరు నెలల కంటే తక్కువ సమయం ఉంది. లేకపోతే ఆయన ఎంపిక బీజేపీకి ఇబ్బందిగా మారుతుంది. దీని ఫలితంగా రాజీనామా చేయాల్సి రావచ్చు.
వార్తసంస్థ ఏఎన్ఐ నివేదికల ప్రకారం.. ఉప ఎన్నికల నేపథ్యంలో తనక్‌పూర్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిలు ర్యాలి నిర్వహించారు. ఆ ప్రాంతమంతా కాషాయ దళంతో నిండిపోయింది. ఇద్దరు ముఖ్యమంత్రులు ర్యాలీకి రావడంతో పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఇద్దరు నేతలు ఉన్న పెద్ద ఓపెన్-టాప్ బస్సు చుట్టూ పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి పైన డెక్‌పై నిలబడి పార్టీ కార్యకర్తలకు నవ్వుతూ చేతులు ఊపుతూ కనిపించారు. చంపావత్ ఉప ఎన్నిక మే 31న జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 3న జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల్లో గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైన ఈ సీటును గెల్చుకోవాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేతలతో పాటు ఏకంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ను సైతం ప్రచారం రంగంలోకి దింపింది.
"పుష్కర్ సింగ్ ధామీ జీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అభివృద్ధి నమూనాను అందించింది. ఉత్తరాఖండ్ ప్రజల కలలను నెరవేర్చడానికి.. బీజేపీ అవసరం.. పుష్కర్ సింగ్ ధామీ వంటివారి సేవలు రాష్ట్రానికి అవసరం" అని మోగీ ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఈ స్థానాన్ని 2017లో బీజేపీకి చెందిన కైలాష్ చంద్ర గెహ్టోరీ గెలుచుకున్నారు.కాగా, ధామి ఒటమిని పక్కనపెడితే.. ఫిబ్రవరి-మార్చిలో జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 47 స్థానాలను కైవసం చేసుకుని, కొండ ప్రాంతాల్లో అధికారాన్ని నిలబెట్టుకుంది బీజేపీ. ఉత్తరప్రదేశ్, మణిపూర్ మరియు గోవాలలో కూడా బీజేపీ వరుస విజయాలు నమోదుచేసి అధికారం దక్కించుకుంది.