అందుకోసం సరస్వతిదేవీని పటాయించండి.. విద్యార్థులకు బిజెపి ఎమ్మెల్యే విచిత్రమైన సలహా

Published : Oct 12, 2022, 12:51 PM ISTUpdated : Oct 12, 2022, 12:52 PM IST
అందుకోసం సరస్వతిదేవీని పటాయించండి.. విద్యార్థులకు బిజెపి ఎమ్మెల్యే విచిత్రమైన సలహా

సారాంశం

ఉత్తరాఖండ్ కు చెందిన‌ బీజేపీ ఎమ్మెల్యే బన్సీధర్ భగత్ వివాదాస్పద వీడియో తెగ వైరల్ అవుతోంది. జ్ఞానాన్ని కావాలంటే.. సరస్వతి దేవీని ప‌టాయించండి. అధికారం కావాలంటే...దుర్గదేవీని ప్రేమించండి, సంపద కోసం.. లక్ష్మిని అట్రాక్ట్ చేయండని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.   

అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకల్లో ఉత్తరాఖండ్‌లోని కలదుంగి అసెంబ్లీకి చెందిన బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బన్షీధర్ భగత్ హిందూ  దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్య‌లు హిందూ మత మనోభావాలను దెబ్బతీసేలా విమ‌ర్శ‌లు వెలువ‌డుతున్నాయి. 

అస‌లేం జ‌రిగిందంటే..? 

అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలలో పాల్గొన్న బిజెపి ఎమ్మెల్యే బన్షీధర్ భగత్ ఈ కార్య‌క్ర‌మంలో ప్రసంగిస్తూ విద్యార్థులకు ఒక విచిత్రమైన సలహా ఇచ్చారు. విద్యార్థులు జీవితంలో రాణించాలంటే సరస్వతీ దేవిని ప‌టాయించాల‌నీ, ఐశ్వర్యం, శ్రేయస్సు కావాలంటే.. లక్ష్మీ దేవిని  ప‌టాయించాల‌నీ విద్యార్థులకు ఉచిత స‌ల‌హా ఇచ్చారు. 

బీజేపీ సీనియర్  ఎమ్మెల్యే నోటి నుంచి అలాంటి మాటలు విని కార్యక్రమానికి హాజరైన జనం కూడా ఉలిక్కిపడ్డారు. అక్కడ కొంతమంది నవ్వుతూ కనిపించారు. ఆ ఎమ్మెల్యే ఇక్కడితో ఆగిపోకుండా..  దేవుళ్ల‌ను కూడా హేళన చేశారు.. విష్ణు, శివుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

హిమాలయాలలోని పర్వతాలలో నివసించే దేవుడు శివుడనీ, ఆయ‌న‌ మెడ లో పాము, త‌ల‌పై గంగా ఉంటుంద‌నీ, ఆయ‌న‌ తల నుండి నిరంత‌రం నీరు ప్రవహిస్తుందని అన్నారు. అదే సమయంలో.. మరొక  దేవుడు మ‌హా విష్ణువు గురించి ప్ర‌స్తావించారు. ఆయ‌న సముద్రపు లోతులలో దాగి ఉంటాడ‌ని,  కాబట్టి ఇద్దరు దేవుళ్ళ మధ్య అంత‌ కమ్యూనికేషన్ లేదని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

ఆ ఎమ్మెల్యే మాటలు విని ప్రజలు అసహనానికి గురయ్యారు. అస‌లు ఎమ్మెల్యే ఎంటీ ఆయ‌న దేవుళ్ల గురించి వింత‌గా మాట్లాడ‌ట‌మేమిట‌ని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, బాలికలు తమలో తాము నిరసనలు వ్య‌క్తం చేశారు.  ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!