ఉత్తరప్రదేశ్‌లో జూలై 20న 36.51 కోట్ల మొక్కలు నాటి యోగి సర్కార్ రికార్డ్ సృష్టించిన విషయం తెెలిసిందే. అయితే ఇప్పుడు నూతన సంవత్సర సంబరాలను కూడా పర్యావరణ హితంగా జరుపుకోవడానికి సిద్దమవుతోంది యూపీ.
లక్నో : యోగి ప్రభుత్వం అడవుల వృద్ది, సంరక్షణపై మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ఒకే రోజు (జూలై 20) 36.51 కోట్ల భారీ మొక్కలను నాటడంలో విజయం సాధించింది యోగి సర్కార్. ఇదే పర్యావరణాన్ని కాపాడేలా నూతన సంవత్సర వేడుకలకు సిద్దమవుతోంది. దీనిలో భాగంగానే అక్టోబర్ 1న రాజధాని లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్టాన్‌లోని ప్లూటో హాల్‌లో రాష్ట్రస్థాయి కార్యక్రమం జరుగుతుంది.
2023-24లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అడవులు, విజయాలకు సంబంధించిన బుక్‌లెట్‌ను కూడా విడుదల చేస్తారు. అలాగే 'పేడ్ లగావో-పేడ్ బచావో (చెట్లను పెంచండి - చెట్లను రక్షించండి'' జన అభియాన్ 2025 కోసం మిషన్ బృందాన్ని కూడా ప్రకటిస్తారు.
undefined
అక్టోబర్ 1 న జరిగే కార్యక్రమంలో పేడ్ లగావో - పేడ్ బచావో జనఅభియాన్- 2024ను విజయవంతం చేసిన మిషన్ బృందాన్ని సన్మానించనున్నారు. అలాగే యోగి ప్రభుత్వ మార్గదర్శకత్వంలో తదుపరి సంవత్సరం కోసం కూడా సన్నాహాలు ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా పేడ్ లగావో, పేడ్ బచావో జనఅభియాన్ 2025 కోసం మిషన్ బృందాన్ని ఏర్పాటు చేస్తారు. 2024-25 సంవత్సరానికి కొత్తగా ఏర్పాటైన మిషన్ బృందానికి బాధ్యతలు అప్పగిస్తారు.ఉత్తరప్రదేశ్ కంపా వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తారు. అలాగే 2023-24లో అడవుల వృద్ది, ఈ సంవత్సరంలో సాధించిన విజయాలపై బుక్‌లెట్‌లను కూడా విడుదల చేస్తారు.
యోగి ప్రభుత్వం 2024లో ఒకే రోజు (జూలై 20) 36.51 కోట్ల మొక్కలు నాటి చరిత్ర సృష్టించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలో దీనిని ప్రారంభించారు. ఈ రోజు లక్నో, గోరఖ్‌పూర్, ప్రయాగరాజ్‌లలో సీఎం మొక్కలు కూడా నాటారు.