అతిక్ అహ్మద్ కు ఐఎస్ఐ తో లింకులు.. పోలీసులు ఏం చెప్పారంటే..?

Published : Apr 16, 2023, 05:03 PM IST
అతిక్ అహ్మద్ కు ఐఎస్ఐ తో లింకులు.. పోలీసులు ఏం చెప్పారంటే..?

సారాంశం

Uttar Pradesh: రాజ‌కీయ నాయ‌కుడు అతిక్ అహ్మద్ కు ఐఎస్ఐ తో ఉన్న లింకుల‌ను పోలీసులు బ‌హిర్గతం చేశారు. శనివారం రాత్రి హతమైన గ్యాంగ్ స్టర్ అండ్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ లకు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.  

Police disclose Atiq Ahmed’s ISI link: శనివారం (15 ఏప్రిల్ 2023) రాత్రి ముగ్గురు షూటర్ల కాల్పుల ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన గ్యాంగ్ స్టర్ అండ్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ లతో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సంబంధాలను పోలీసులు వెల్లడించారు. అతను ఐఎస్ 227 ముఠాకు నాయకుడనీ, అతని సోదరుడు అష్రఫ్ అందులో క్రియాశీలక సభ్యుడని వారు తెలిపారు. పాకిస్తాన్ కు చెందిన  లష్కరే తోయిబా, ఐఎస్ ఐలతో తనకు సంబంధాలున్నాయనీ, పంజాబ్ లో పాక్ డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడిచినట్లు అతిక్ ఒక ప్రకటనలో తెలిపిట‌న‌ట్టు పేర్కొన్నారు. ఆయుధాలు అందజేసిన వ్యక్తుల చిరునామా తమకు తెలుసుననీ, అయితే జైలు నుంచి వారిని గుర్తించలేకపోయామని, వారు అక్కడికి చేరుకుంటేనే చెప్పగలమని అతిక్, అష్రఫ్ పోలీసులకు తెలిపిన‌ట్టు మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. ఉమేష్ పాల్ హత్యకు ఉపయోగించిన ఆయుధాలు పాక్ కు చెందిన ఏజెన్సీల నుంచి వచ్చాయని కూడా సంబంధిత క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.

ఉమేష్ పాల్ హత్య కేసు

ఫిబ్రవరి 24న ప్రయాగ్ రాజ్ లోని తన నివాసం సమీపంలో ఉమేష్ పాల్ ను కాల్చి చంపారు. ఈ దాడిలో అతని అంగరక్షకుల్లో ఒకరు గాయపడి ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయారు. ఉమేష్ పాల్, అతని ఇద్దరు పోలీసు అంగరక్షకుల్లో ఒకరు ఎస్యూవీ నుంచి దిగుతుండగా అకస్మాత్తుగా వెనుక నుంచి ఓ వ్యక్తి వచ్చి కాల్పులు జరిపినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ ప్రధాన నిందితులు. అలహాబాదు (పశ్చిమ) అసెంబ్లీ స్థానం నుంచి మాజీ అతిక్ అహ్మద్ తమ్ముడు ఖలీద్ అజీమ్ ను ఓడించి తొలిసారి విజయం సాధించిన కొన్ని నెలలకే రాజు పాల్ హత్యకు గురయ్యారు. నిందితులంతా ప్రస్తుతం యూపీ, గుజరాత్ జైళ్లలో ఉన్నారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అహ్రాఫ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు.

ముగ్గురు కాల్పులు జ‌ర‌ప‌డంతో అతిక్, అష్రఫ్ మృతి

ప్రయాగ్ రాజ్ లో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యకు గురయ్యారు. వారిపై పాయింట్ బ్లాంక్ లో కాల్పులు జ‌రిపారు. వీరిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాగ్ రాజ్ లోని ఎంఎల్ ఎన్ మెడికల్ కాలేజీకి తీసుకువెళ్ల‌గా, అక్క‌డి ఆవరణలోనే ఈ కాల్పులు జరిగాయి. ముగ్గురు షూటర్లు లవలేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యలను యూపీ పోలీసులు అరెస్టు చేయగా, ఒక పోలీసు కానిస్టేబుల్ మాన్ సింగ్ కు స్వల్ప గాయాలయ్యాయి. తన కుమారుడు అసద్ అహ్మద్ అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటల్లోనే మాజీ ఎంపీ హత్యకు గురయ్యారు. ఈ ఘటన తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాంతిభద్రతల ఏడీజీ ప్రశాంత్ కుమార్ కు సమన్లు జారీ చేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ప్రయాగ్ రాజ్ లో హై అలర్ట్ ప్రకటించి, సమీప జిల్లాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సహా అదనపు బలగాలను మోహరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం