
e-pension portal: లక్నోలో 'ఈ-పెన్షన్ పోర్టల్'ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం నాడు ప్రారంభించారు. దీని ద్వారా 11.5 లక్షల మంది సిబ్బందికి నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో ముందడుగు అని ఆయన అభివర్ణించారు. "ప్రతికూలత అనేది ఒక వ్యక్తిని ఎప్పటికీ పురోగతి శిఖరాగ్రానికి తీసుకెళ్లదని నేను భావిస్తున్నాను, అది ఎల్లప్పుడూ వ్యక్తిని అధోకరణం వైపు నడిపిస్తుంది, కాబట్టి మంచి ఆలోచన ఎల్లప్పుడూ మనల్ని ముందుకు నడిపిస్తుంది మరియు అదే మంచి ఆలోచనతో ప్రభుత్వం మీ కోసం ఇ-పెన్షన్ పోర్టల్ తీసుకువచ్చింది" అని యోగి అన్నారు. అవినీతి రహిత వ్యవస్థ కోసం 2014లో ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారని చెప్పారు. ప్రధాని స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను అందిపుచ్చుకుని పనిచేసి దాని ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇ-పెన్షన్ పోర్టల్ ఈ వ్యవస్థలో భాగంగానే ప్రారంభిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని లక్షలాది మంది కార్మికులు ఈ పోర్టల్ ద్వారా ప్రయోజనం పొందుతారని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇప్పుడు ఎలాంటి కారణం లేకుండా ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆర్థిక శాఖ ఈ విధానాన్ని అవలంబించింది.. ఇది ఇతర విభాగాలలో అమలు చేయబడుతుంది. ఈ-పోర్టల్ నుంచి పేపర్ లెస్ సిస్టమ్ అమలులోకి వస్తుందని.. మందపాటి ఫైల్ సృష్టించాల్సిన అవసరం ఉండదని అన్నారు. పింఛనుదారులకు ఈ-పోర్టల్ వ్యవస్థను అందిస్తున్న తొలి రాష్ట్రంగా యూపీ అవతరించిందన్నారు. నెగెటివ్ థింకింగ్ అధోగతికి, పాజిటివ్ థింకింగ్ ప్రగతికి దారితీస్తుందని అన్నారు. ఒక ఉద్యోగి తన జీవితంలో 30 నుండి 35 సంవత్సరాలు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో పనిచేస్తాడు.. ఆ వ్యక్తి దాని నుండి చాలా అనుభవాన్ని పొందుతాడు. సమాజం మరియు కొత్త తరం ఈ అనుభవాన్ని పొందాలి అని యోగి అన్నారు.
అంతకుముందు గతంలో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని పండుగ సందర్భంగా విద్యుత్ సరఫరా సజావుగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు. టీమ్-09తో ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ మరియు సరఫరాలో సమన్వయం పాటించాలని సీఎం యోగి అధికారులను కోరారు. కాగా, ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యోగి సమావేశం ప్రధాన్యత సంతరించుకుంది. అక్షయ తృతీయ, పరశురామ జయంతి, ఈద్ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్తుకు అంతరాయం లేకుండా సరఫరా కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా అనవసరమైన కోతలు పెట్టవద్దు. దీంతో పాటు అన్ని మత స్థలాల చుట్టూ పరిశుభ్రత, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఉత్తరప్రదేశ్ లో వరుసగా రెండో సారి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. రైతుల ఆదాయ పెంపు, ఉపాధి కల్పన దృష్టిసారించింది. వచ్చే వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి కనీసం ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలని యోగి సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి రైతు కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా వచ్చే ఐదేండ్లలో 2,10,000 మంది పారిశ్రామికవేత్తలు, రైతులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. తాము రైతుల కోసం అన్ని రకాల మెరుగైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపాయి.