UP CMO Twitter: ఉత్తరప్రదేశ్ సీఎంఓ ట్విట్టర్ ఖాతా హ్యాక్

Published : Apr 09, 2022, 06:23 AM ISTUpdated : Apr 09, 2022, 06:35 AM IST
UP CMO Twitter: ఉత్తరప్రదేశ్ సీఎంఓ ట్విట్టర్ ఖాతా హ్యాక్

సారాంశం

UP CMO Twitter: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడింది. సీఎంఓ ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడిన‌ట్టు అధికారులు శనివారం గుర్తించారు.తెలియని హ్యాకర్లు UP CMO Twitter హ్యాండిల్‌ని ఉపయోగించి వివిధ పోస్టుల‌ను చేసిన‌ట్టు అధికారులు గుర్తించారు.  

UP CMO Twitter: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ట్విట్టర్ ఖాతా శుక్రవారం రాత్రి హ్యాక్ చేయబడింది. CMO యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి వందలాది మంది ట్విట్ట‌ర్ వినియోగదారుల‌కు ట్యాగ్ చేస్తూ హ్యాకర్ అనేక ట్వీట్లను పోస్ట్ చేయ‌బ‌డ్డాయి. దీంతో అకౌంట్ హ్యాక్ అయిన‌ట్టు అధికారులు గుర్తించారు. అయితే, కొన్ని గంటల తర్వాత ఖాతా పునరుద్ధరించబడింది.

హ్యాక్ అయిన సీఎంఓ అకౌంట్ స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా, హ్యాకర్లు ప్రొఫైల్ ఫోటోను, ఖాతాని కూడా మార్చారు. హ్యాకర్లు UP CMO యొక్క ట్విట్టర్ హ్యాండిల్‌లో "ట్యుటోరియల్: మీ BAYC/MAYCని ట్విట్టర్‌లో ఎలా ఆన్ చేయాలి" అనే దానిని పోస్టు చేసి పిన్ చేసారు. అలాగే.. ఒక కార్టూనిస్ట్ చిత్రాన్ని ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించారు. సీఎంఓ ఖాతాలో కొన్ని యాదృచ్ఛిక ట్వీట్ల థ్రెడ్‌ను కూడా పోస్ట్ చేస్తున్న‌ట్టు గుర్తించారు.

యూపీ పోలీసులు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ట్యాగ్ చేస్తూ హ్యాక్ చేసిన ఖాతా స్క్రీన్‌షాట్‌లను నెటిజన్లు షేర్ చేశారు. అధికారులు రంగంలోకి దిగి ఖాతాను పునరుద్ధరించారు. హ్యాకర్లు పెట్టిన ట్వీట్లన్నీ డిలీట్ అయ్యాయి. ప్ర‌స్తుతం UP CMO (@CMOfficeUP) ట్విట్టర్ ఖాతాకు ప్రస్తుతం నాలుగు మిలియన్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు.

ప్రభుత్వ శాఖ లేదా ప్రభావవంతమైన వ్యక్తికి చెందిన ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ కావడం ఇది మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతా కూడా హ్యాక్‌కి గురైంది. ముఖ్యంగా, హ్యాకర్లు భారతదేశం "అధికారికంగా బిట్‌కాయిన్‌ను చట్టబద్ధమైన టెండర్‌గా స్వీకరించింది" అని పేర్కొంటూ PM యొక్క ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక ట్వీట్‌ను ఉంచారు.
 

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu