యూపీలో విషాదం: ఫ్యాక్టరీలో విషవాయువు లీకై ఏడుగురు మృతి

Published : Feb 06, 2020, 12:57 PM IST
యూపీలో  విషాదం: ఫ్యాక్టరీలో విషవాయువు లీకై ఏడుగురు మృతి

సారాంశం

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ఫ్యాక్టరీలో విషవాయువు లీకై ఏడుగురు కార్మికులు మృతి చెందారు. 

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నాడు  విషాదం చోటు చేసుకొంది. విషవాయువు లీకై ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన తెలిసిన వెంటనే అధికారులు ఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్‌లోని ఓ ఫ్యాక్టరీలో గురువారం నాడు ఉదయం టాక్సిక్ యాసిడ్ వెలువడినట్టుగా స్థానికులు చెబుతున్నారు. టాక్సిక్ యాసిడ్ విడుదల కావడంతో ఏడుగురు కార్మికులు  మృతి చెందారు. మరికొందరు అస్వస్థతకు గురైనట్టుగా సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం హుటాహుటిన సంఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టింది.

PREV
click me!

Recommended Stories

PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?