యోగి మరో సంచలనం: 25 వేల మంది హోంగార్డుల తొలగింపు

By Siva KodatiFirst Published Oct 15, 2019, 2:52 PM IST
Highlights

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 25 వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 25 వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తగినంత బడ్జెట్ లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆగస్టు 28న జరిగిన సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2

5 వేల మంది హోంగార్డులను పూర్తిగా విధుల్లోంచి తొలగించిన ప్రభుత్వం.... మరో 99 వేల మంది హోంగార్డులకు సగం పనిదినాలు మాత్రమే ఉంటాయని తెలిపింది. అంటే నెలకే కేవలం 15 రోజుల పాటు విధుల్లో ఉంటారు.

దీనిపై మీడియాతో మాట్లాడిన యూపీ డీజీపీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. కానిస్టేబుళ్ల మాదిరిగానే హోంగార్డులకు సైతం డీఏ చెల్లించాల్సి వస్తుందని.. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతోందన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు డీజీపీ వెల్లడించారు.

కాగా ఈ తొలగించిన కానిస్టేబుళ్లను ఏడాది క్రితమే విధుల్లోకి తీసుకున్నారు. హోంగార్డులకు డీఏ కింద గతంలో రూ.500 చెల్లించేవారు... అయితే సుప్రీం ఆదేశాలతో మొత్తం రూ.672 చెల్లించాల్సి వస్తోంది. 

click me!