బేరం దగ్గర గొడవ: రూ.100 కోసం సెక్స్‌వర్కర్‌ హత్య, 30 సార్లు పొడిచి

Siva Kodati |  
Published : Oct 15, 2019, 02:35 PM IST
బేరం దగ్గర గొడవ: రూ.100 కోసం సెక్స్‌వర్కర్‌ హత్య, 30 సార్లు పొడిచి

సారాంశం

కేవలం 100 రూపాయల కోసం ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కామాఠిపురా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అక్కడికి దగ్గరలోని ఓ సెక్స్‌వర్కర్‌తో గడిపేందుకు రూ.500లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు

కేవలం 100 రూపాయల కోసం ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కామాఠిపురా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అక్కడికి దగ్గరలోని ఓ సెక్స్‌వర్కర్‌తో గడిపేందుకు రూ.500లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అయితే ఆ వ్యక్తి ఆమెను రూ.100 తిరిగి ఇచ్చేయమన్నాడు. దీనికి సెక్స్‌‌వర్కర్‌ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను కసితీరా 3 సార్లు పొడిచి చంపాడు.

ఆ దారిలో వెళుతుండగా మహిళ అరుపులు విన్న ఓ వ్యక్తి దుండగుడి బారి నుంచి ఆమెను రక్షించడానికి అటుగా వెళ్లాడు. దీంతో అతడిపైనా నిందితుడు దాడి చేసి పొడిచాడు. ఈ నేపథ్యంలో స్పందించిన చుట్టు పక్కలవారు ఆస్పత్రిలో చేర్చారు.

ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని క్యాటరింగ్ చేసే వ్యక్తిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.     
 

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu